Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
అమ్మమ్మల నాటి రుచిని గుర్తుచేసే పచ్చి మామిడికాయ రసం..సింపుల్ గా ఎలా చేసుకోవాలంటే..
ప్రస్తుతం మార్కెట్ లోకి పచ్చి మామిడికాయలు వస్తున్నాయి. అయితే ఈ పచ్చి మామిడికాయలను తినడానికే కాకుండా వీటితో అప్పటికప్పడు కమ్మనైన రసం కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడూ ఇంట్లో చేసుకునే చింతపండు,టమాటో రసం కాకుండా పచ్చి మామిడికాయతో రసం చేసి చూడండి. దీని టేస్ట్ యమా రుచికరంగా ఉంటుంది. ఈ రుసం రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలామంచిదని చెబుతుంటారు. దీనిని తయారుచేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. పచ్చిమామిడికాయ రసం తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
పచ్చిమామిడికాయ రసం తయారీకి కావలసిన
పదార్థాలు
-పచ్చి మామిడికాయ
-మిరియాలు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-ఆయిల్
-మెంతులు
-ఆవాలు
-జీలకర్ర
-శెనగపప్పు
-ఉప్పు
-పసుపు
-టమాటో
-వెల్లుల్లి రెబ్బలు
-అల్లం
-కొత్తిమీర తరుగు
-కరివేపాకు

పచ్చిమామిడికాయ రసం తయారీ విధానం
-ముందుగా ఒక పచ్చిమామిడికాయను తీసుకొని దాని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో 1 టీస్పూన్ మిరియాలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే అర ఇంచు అల్లం, 5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసి పెట్టుకోండి. తేలికగా క్రష్ చేసినట్లుగా గ్రైండ్ చేసుకుంటే చాలు.
-ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో పచ్చి మామాడి ముక్కలు, రుచికి సరిపడా కల్లు ఉప్పు, కొద్దిగా పసుపు,నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి.
-తర్వాత రసం తాళింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా మెంతులు,ఆవాలు,జీలకర్ర,శెనగపప్పు,ఎండుమిర్చి వేసి దోరగా వేగాక ఇందులోనే కరివేపాకు,గ్రైండ్ చేసిన మిరియాలు వెల్లుల్లి పొడి వేసి కలపండి.
-ఇప్పుడు తాళింపులో గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ ని వేసి కలపండి. పచ్చి వాసన పోయే దాకా వేపుకోవాలి.
-5 నిమిషాల తర్వాత అందులో 1 లీటరు నీళ్లు పోసి బాగా కలిపాక ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు, చేత్తోనో ఓ టమాటోని నలిపి ఇందులో వేసేయాలి.
-రసం బాగా మరిగిన తర్వాత అందులో కొద్దిగా బెల్లం వేసి కలిపి తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత అందులో కొత్తిమీర తరుగు కొంచెం చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే మామిడికాయ రసం రెడీ. దీనిని వేడి అన్నంలో అయినా లేదా చద్దన్నంలో అయినా కలుపుకుని తింటే అహా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications