Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Mango Pakodi: నోరూరించే పచ్చిమామిడికాయ పకోడీ..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
మీరు ఇప్పటిదాకా అనేక రకాల పకోడీ వెరైటీలను టేస్ట్ చేసి ఉంటారు. అయితే సమ్మర్ లో దొరికే పచ్చిమామిడికాయతో తయారుచేసే పకోడీ ఎప్పుడైనా తిన్నారా? యమా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయంలో స్నాక్ ఐటమ్ గా ఇది తినడానికి చాలా చాలా బాగుంటుంది. పచ్చిమామిడికాయతో పకోడీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేయాలి, దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మామిడికాయ పకోడీ తయారీకి కావలసిన పదార్ధాలు
-మామిడికాయ
-మినపపిండి
-మసాలా
-తినే సోడా
--ఉల్లిపాయ
-కారం
-ఉప్పు
-కరివేపాకు
-కొత్తిమీర
-ఆయిల్

మామిడికాయ పకోడీ తయారీ విధానం
-మీరు ఇప్పటిదాకా అనేక రకాల పకోడీ వెరైటీలను టేస్ట్ చేసి ఉంటారు.
-ముందుగా పచ్చిమామిడికాయ తీసుకొని దాని పొట్టు తీసేయాలి.
-తర్వాత ఆ మామిడికాయను కుడుకలు గీరే దానితో మంచిగా పొరలు పొరలుగా గీరుకోవాలి.
-ఇప్పుడు ఓ గిన్నెలో మినపపిండి వేసి తురుముకున్న మామిడికాయ అందులో వేసుకోవాలి.
-మీకు కావాలనుకుంటే మినపపండికి బదులు శనెగపిండి కూడా వొడచ్చు.
-తర్వాత అందులో తగినంత కారం,ఉప్పు, 1 చెంచా మసాలా,చిటికెడు తినే సోడా,చిన్నగా తరిగిన 2 ఉల్లిగడ్డల ముక్కలు,4-5 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కాడలతో సహా కొత్తిమీర వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
-అందులో సరిపడా నీళ్లు పోసుకుంటూ కలుపుకొని పక్కనపెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చెయ్యాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవాలి.
-ఎర్రగా కాలిన తర్వాత వాటాని దించేయాలి. అంతే మామిడికాయ పకోడీ రెడీ.
రాయలసీమ స్పెషల్ రాగి సంగటి, నాటు కోడి పులుసు..దీని రుచి దేనికి రాదు,ఈ పద్థతిలో చేసుకోండి
ప్రయోజనాలు
పచ్చి మామిడికాయ పకోడీ రుచికరమైనది మాత్రమే కాకుండా కొన్ని ఆరోగ్య
ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అయితే ఇది డీప్ ఫ్రై చేసిన ఆహారం కాబట్టి
దాని ప్రయోజనాలు మితంగానే ఉంటాయి. పచ్చి మామిడికాయలో విటమిన్ సి
పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి, చర్మాన్మి
ఆరోగ్యంగా ఉంచడానికి, శరీరంలో ఐరన్ శోషణకు ఉపయోగపడుతుంది. అలాగే
పచ్చిమామిడికాయ కాలేయానికి రక్షణ కలిగిస్తుందని..కాలేయ పనితీరుని
మెరుగుపరుస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. . అయితే పకోడీలను
డీప్ ఫ్రై చేయడం వల్ల అవి ఎక్కువ నూనెను గ్రహిస్తాయి.. ఇది వాటి
కేలరీల మొత్తాన్ని, కొవ్వు శాతాన్ని పెంచుతుంది. కాబట్టి పచ్చి
మామిడికాయ పకోడీలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
మితంగానే వీటిని తినడం ఉత్తమం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications