Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రాయలసీమ స్పెషల్ రాగి సంగటి, నాటు కోడి పులుసు..దీని రుచి దేనికి రాదు,ఈ పద్థతిలో చేసుకోండి
రాయలసీమ వంటకాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది రాగి సంగటి. రాయలసీమ స్పెషల్ రాగి సంగటి,నాటు కోడి పులుసు. రాయలసీమ రాగి సంగటి ఒక సాంప్రదాయకమైన, పోషకమైన ఆహారం. రాయలసీమ ప్రాంతంలో చాలామంది పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి కూడా దీనిని తింటారు. రాగులు, బియ్యం కలయికతో తయారయ్యే ఈ వంటకం రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని తయారీ విధానం చాలా సులభం, తక్కువ పదార్థాలతోనే చేసుకోవచ్చు. రాయలసీమ స్పెషల్ రాగి సంగటి తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగి సంగటి తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు
-రాగి పిండి - 1 కప్పు
-వండిన అన్నం - 1/2 కప్పు
-నీరు - 2 కప్పులు
-ఉప్పు - రుచికి తగినంత

రాగి సంగటి తయారీ విధానం
-రాగి సంగటి తయారీ కోసం ముందుగా ఒక మందపాటి గిన్నెలో నీరు పోసి బాగా మరిగించాలి.
-నీరు మరుగుతున్నప్పుడు..ముందుగా వండిన అన్నం వేసి కొన్ని నిమిషాలు ఉడకనివ్వాలి.
-అన్నం మెత్తగా ఉడికి నీటిలో కలిసిపోయేలా చూడాలి.
-తర్వాత రాగి పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపాలి. పిండిని వేసేటప్పుడు ఒక చేత్తో కలుపుతూ ఉండాలి.
-మంటను తగ్గించి మూత పెట్టి 5-7 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.. లేదంటే అడుగంటుతుంది.
-సంగటి చిక్కగా తయారై పిండి బాగా ఉడికిన తర్వాత ఉప్పు వేసి కలపాలి.
-స్టవ్ ఆఫ్ చేసి సంగటిని కొద్దిగా చల్లారనివ్వాలి.
-చేతులకు కొద్దిగా నీరు రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అంతే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి రెడీ.
-రాయలసీమ రాగి సంగటిని నెయ్యి, పప్పు, కూరలు లేదా మాంసాహార కూరలతో వేడి వేడిగా వడ్డించుకోవచ్చు. ముఖ్యంగా నాటుకోడి పులుసుతో ఈ సంగటి చాలా రుచిగా ఉంటుంది.
ఆహా ఏమి రుచి..బెస్ట్ చికెన్ స్టార్టర్..డ్రాగన్ చికెన్ ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూడండి
నాటు కోడి పులుసు తయారీకి కావలసిన పదార్థాలు
-నాటు కోడి ముక్కలు - 500 గ్రాములు
-ఉల్లిపాయలు - 2
-టొమాటోలు - 2
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
-పసుపు - 1/2 టీ స్పూన్
-కారం - 2-3 టేబుల్ స్పూన్లు
-ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
-గరం మసాలా - 1/2 టీ స్పూన్
-చింతపండు రసం - 1/2 కప్పు
-నూనె - 3-4 టేబుల్ స్పూన్లు
-ఉప్పు - రుచికి తగినంత
-కొత్తిమీర - కొద్దిగా
-కరివేపాకు - 2 రెమ్మలు
-పచ్చిమిర్చి - 2-3
కేవలం 10 నిమిషాల్లో అప్పటికప్పుడు రాగి ఇడ్లీ రెడీ..ఈ పద్ధతిలో చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
నాటు కోడి పులుసు తయారీ విధానం
-నాటు కోడి ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ లో ఆయిల్ వేడి చేయాలి.
-ఆయిల్ వేడెక్కాక అందులో కరివేపాకు,పచ్చిమిర్చి వేసి వేయించాక తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాక తరిగిన టొమాటోలు వేసి మెత్తగా ఉడికే వరకు వేయించాలి.
-తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి,జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. కొద్దిగా నీరు వేసి మసాలాలు అడుగంటకుండా వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో శుభ్రం చేసుకున్న కోడి ముక్కలు వేసి మసాలాలు బాగా పట్టేలా కలపాలి. రుచికి తగినంత ఉప్పు వేయాలి. మూత పెట్టి లేదా కుక్కర్ లో అయితే 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కోడి ముక్కలు మెత్తగా ఉడకాలి.
-కోడి ముక్కలు ఉడికిన తర్వాత, చింతపండు రసం పోసి బాగా కలపాలి. పులుసు కావలసిన చిక్కదనానికి వచ్చే వరకు మరిగించాలి.
-చివరగా గరం మసాలా, తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. అంతే నాటు కోడి పులుసు రెడీ.
-స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా రాయలసీమ రాగి సంగటితో దీనిని తింటే అదరహో అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications