Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
చికెన్ లెగ్ పీస్‌లంటే నాన్ వెజ్ ప్రియులు పడిచచ్చిపోతారు. బిర్యానీలో వచ్చిందంటే వారికి లక్కే ఇక. ఇక లెగ్ పీస్‌లతో వేపుడు కూడా ఇష్టంగా లాగించేస్తారు. అయితే ఈ సారి కొత్తగా చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీగా కుష్కా ట్రై చేయండి. వేళ్లు జుర్రుకుంటూ ముద్ద కూడా వదలకుండా లాగించేస్తారు.

చికెన్ జాయింట్స్ కుష్కా తయారీకి కావాల్సిన పదార్థాలు
బాస్మతి రైస్- రెండు గ్లాసులు(అర కేజీ)
చికెన్ జాయింట్ పీస్‌లు- రెండు
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
ఉల్లిపాయలు- రెండు (మీడియం సైజు)
పచ్చిమిర్చి- నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్- మూడు టీస్పూన్లు
పసుపు- పావు టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
కారం- రెండు టేబుల్ స్పూన్లు
పెరుగు- 150మి.లీ
ధనియాల పొడి- రెండు టీస్పూన్లు
గరం మసాలా- టీస్పూన్లు
జీలకర్ర పొడి- టీస్పూన్లు
మసాలా దినుసులు
టమాటాలు- రెండు
చికెన్ జాయింట్స్ కుష్కా తయారీ విధానం
చికెన్ జాయింట్స్ కుష్కా తయారీ కోసం ముందుగా లెగ్ పీస్‌లను కడిగి ఒక బౌల్లో నీళ్లు ఉప్పు, వెనిగర్ వేసి గంటపాటు నానబెట్టుకోవాలి. తర్వాత బాస్మతి రైస్‌ను కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను, టమాటాలను సన్నగా, పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి.
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
చికెన్ జాయింట్ పీస్‌లు నానిన తర్వాత స్టవ్‌పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో లెగ్ పీస్‌లను వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇప్పుడు సగం ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి.

తర్వాత ఒకటిన్నర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్ పసుపు, టీస్పూన్ గరం మసాలా, టీస్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి. మసాలా బాగా మగ్గిన తర్వాత పెరుగు వేసి కలపాలి. ఉడికిన తర్వాత లెగ్ పీస్‌లు వేసుకోవాలి. లెగ్ పీస్‌లకు మసాలాలు వేసి మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పీస్‌లను పక్కన పెట్టుకోవాలి.
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.!
ఇప్పుడు స్టవ్‌పైన వెడల్పాటి బాణలి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక మసాలా దినుసులు వేసి కలపాలి. కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత టమాటాలు వేసి మగ్గించుకోవాలి.
టమాటా మెత్తగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పెరుగు వేసి బాగా కలపాలి. ఉడుకుతున్నప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేయించాలి.
ఉడికిన తర్వాత మూడు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. ఎసరు మరిగిన తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కలిపి పెద్ద మంటపైన ఉడకనివ్వాలి. 80 శాతం ఉడికిన తర్వాత స్టవ్‌పైన పెనం పెట్టి వేడయ్యాక దానిపై కుష్కా బాణలి పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించినట్లయితే ఘుమఘుమలాడుతూ స్పైసీ కుష్కా రెడీ. వీటిని చికెన్ జాయింట్స్‌తో సర్వ్ చేసుకుని తినేయడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications