Latest Updates
-
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్‌లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.!
పులావ్ అనగానే ఎవరికైనా ఇంట్లో పండుగ వాతావరణం గుర్తొస్తుంది. దీని కాంబినేషన్‌గా మటన్, చికెన్ గ్రేవీ ఉంటే ఆ మజానే వేరు. ఈ రెండింటినీ కలిపి కూడా చికెన్, మటన్ పులావ్ ట్రై చేస్తుంటారు. అయితే ఎప్పుడైనా కొబ్బరి పాలతో చికెన్ పులావ్ ట్రై చేశారా.. కొబ్బరి పాలతో ఇప్పటికే డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ ట్రై చేసి ఉంటారు.. కానీ ఈ నాన్‌వెజ్ స్పెషల్ డిష్ టేస్ట్ మాత్రం ఎవర్ గ్రీన్. కొబ్బరి పాల చికెన్ పులావ్ ఎలా తయారుచేయాలో చూద్దాం..

కొబ్బరి పాల చికెన్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
చికెన్- 600 గ్రాములు
బాస్మతి రైస్- 500 గ్రాములు
నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు
మసాలా దినుసులు- టేబుల్ స్పూన్
సోంపు- అర టీస్పూన్
జీడిపప్పు పలుకులు- పదిహేను
ఉల్లిపాయలు- మూడు(మీడియం సైజు)
అల్లంవెల్లుల్లి పేస్ట్- రెండు టేబుల్
స్పూన్లు
పచ్చిమిర్చి- ఐదు
కొత్తిమీర- కొద్దిగా
పుదీనా- గుప్పెడు
ఉప్పు- రుచికి సరిపడా
గరంమసాలా- టీస్పూన్
మిరియాల పొడి- అర టీస్పూన్
కొబ్బరి పాలు- రెండు కప్పులు
కొబ్బరి పాల చికెన్ పులావ్ తయారీ విధానం
ముందుగా స్టవ్‌పైన కుక్కర్ పెట్టుకుని వేడయ్యాక నెయ్యి వేసి కరగనివ్వాలి. నెయ్యి కాగిన తర్వాత అందులో మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి.
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా..
ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా పొడుగ్గా కట్ చేసి కడాయిలో వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
ఉల్లిపాయలు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కలపాలి. చికెన్‌లోని నీరంతా పోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి.

చికెన్ ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, నల్ల మిరియాల పొడి వేసి కలపాలి.
ఇప్పుడు కడిగి అరగంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం చికెన్‌లో వేసుకుని కలుపుకోవాలి.
రెండు నిమిషాల తర్వాత మీరు తీసుకున్న బియ్యానికి రెండింతలు కొబ్బరిపాలు పోసి కలపాలి. ఒకసారి మొత్తం గరిటెతో కలియతిప్పి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసినట్లయితే ఘుుమఘుుమలాడే కొబ్బరి పాల చికెన్ పులావ్ రెడీ.
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్!
ఈ బిర్యానీని రైతా, సలాడ్, ఏదైనా స్పైసీ గ్రేవీతో తింటే ఆ అనుభూతే వేరు. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ కోసం తప్పనిసరిగా ట్రై చేయాల్సిన టేస్టీ కొబ్బరి పాల చికెన్ పులావ్ ఇది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
