Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
Ragi Chapati: పోషకమైన రాగి చపాతీలు..చాలా మెత్తగా సూపర్ టేస్టీగా ఉంటాయి..ఎలా చేసుకోవాలంటే
రాగులు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో విరివిగా పండించే చిరుధాన్యం. వీటిని ఫింగర్ మిల్లెట్ అని కూడా అంటారు. రాగులు పోషకాల గని. కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. గోధుమ పిండితో పోలిస్తే రాగి పిండిలో పోషక విలువలు ఎక్కువ. అందుకే రాగి పిండి ఉపయోగించి చేసే చపాతీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.వాటిలోని పోషకాలు మన శరీరాన్ని అనేక రోగాల నుండి కాపాడతాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులువు.
రాగి చపాతీ తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి - 2 కప్పులు
గోధుమ పిండి - 1/2 కప్పు
వేడి నీరు - తగినంత
నూనె లేదా నెయ్యి - కాల్చుకోవడానికి తగినంత

రాగి చపాతీ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో రాగి పిండి వేయాలి. కావాలనుకుంటే ఇందులో గోధుమ పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా వేడి నీరు పోస్తూ మెత్తని పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. చపాతీ పిండిలాగా ఉండాలి.
-కలిపిన పిండిని తడి గుడ్డ కప్పి కనీసం 15-20 నిమిషాలు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి.
-నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండిలో అద్దుతూ గుండ్రంగా పలుచగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఒత్తితే చపాతీలు గట్టిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి.
శరీరానికి పుష్టినిచ్చే రాగి లడ్డు..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే
-స్టవ్ మీద పెనం వేడి చేయాలి. పెనం వేడెక్కిన తర్వాత ఒత్తి పెట్టుకున్న చపాతీని వేయాలి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండోవైపు తిప్పి కాల్చాలి. రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత నూనె లేదా నెయ్యి వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే రాగి చపాతీ రెడీ.
-వేడి వేడి రాగి చపాతీలను కూరలు, పప్పు, చట్నీ లేదా పెరుగుతో కలిపి తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
