Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రాముడి కాలం నాటి బ్రేక్ ఫాస్ట్..తింటే 100 ఏళ్లు గ్యారెంటీ,ఎలా చేయాలంటే..
ఈ రోజుల్లో ఏది పడితే అది తిని అనారోగ్యం పాలై హాస్పిటల్స్ లో లక్షల రూపాయలు ఖర్చుపెట్టడం కన్నా తక్కువ ఖర్చులోనే దొరికే పదార్థాలు తిని ఆరోగ్యంగా ఉండటం ఉత్తమం. తక్కువ ఖర్చులో ఎక్కువ ఆరోగ్యాన్ని అందించే ఫుడ్స్ లో బార్లీ జావ ఒకటి. దీనిని ఇంట్లోనే చాలా సులభంగా తక్కువ ఖర్చుతో తయారుచేసుకోవచ్చు. పొద్దున్నే ఇడ్లీ,దోశ,పూరీ,బోండాలు వంటివి తినడం కన్నా ఈ బార్లీ జావ తీసుకుంటే ఆరోగ్యానికి బోలెడంత మేలు జరుగుతుంది.
బార్లీ జావ ఒక సాంప్రదాయక, ఆరోగ్యకరమైన ఆహారం. ఇది బార్లీ గింజలతో తయారు చేయబడుతుంది. తేలికగా జీర్ణమయ్యే ఇది పోషకాలు నిండి ఉంటుంది. రామయణంలో కూడా బార్లీ ప్రస్తావన ఉంది. అంటే అప్పట్లోనే ప్రజలు దీనిని తినేవారని అర్థం చేసుకోవచ్చు. బార్లీ జావను ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్న భోజనంగా లేదా తేలికపాటి నైట్ డిన్నర్ గా కూడా తీసుకోవచ్చు. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఫర్ఫెక్ట్. బార్లీ జావ ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

బార్లీ జావ తయారీకి కావలసిన పదార్థాలు
-బార్లీ గింజలు (పొట్టు తీసినవి) - 1 కప్పు
-నీరు లేదా పాలు - 3-4 కప్పులు
-ఉప్పు - రుచికి తగినంత
-తీపి కోసం - బెల్లం తురుము, చక్కెర, తేనె
-రుచి కోసం (తీపి జావ కోసం) - యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి, డ్రై
ఫ్రూట్స్ (బాదం, పిస్తా, కిస్మిస్ మొదలైనవి)
-రుచి కోసం (ఉప్పు జావ కోసం) - కూరగాయలు తరుగు (క్యారెట్, బఠానీలు,
ఉల్లిపాయలు మొదలైనవి), జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి
బార్లీ జావ తయారీ విధానం
-బార్లీ జావను రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు - తీపి జావ, ఉప్పు జావ రెండింటి తయారీ విధానం ఇక్కడ చూడండి.
-తీపి బార్లీ జావ తయారుచేయడం కోసం ముందుగా బార్లీ గింజలను శుభ్రంగా కడిగి కనీసం 2-3 గంటలు నీటిలో నానబెట్టండి.
-నానబెట్టిన బార్లీని నీటితో సహా ఒక మందపాటి అడుగుగల పాత్రలో వేసి స్టవ్ మీద పెట్టి మంట మీద ఉడికించాలి. నీరు మరుగుతున్నప్పుడు పైకి వచ్చే నురుగును తీసివేయండి.
-బార్లీ మెత్తగా ఉడికి జావ లాగా చిక్కబడే వరకు ఉడికించండి. ఇది సుమారు 20-30 నిమిషాలు పట్టవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి..లేదంటే అడుగంటుకుపోయే అవకాశం ఉంది.
-జావ కావలసినంత చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
-ఇప్పుడు బెల్లం తురుము, చక్కెర లేదా తేనె వేసి బాగా కలపండి. తీపిని మీ రుచికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు.
-రుచి కోసం యాలకుల పొడి లేదా దాల్చిన చెక్క పొడి చల్లండి.
చివరగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపండి.
-వేడి వేడిగా లేదా గోరువెచ్చగా తీపి బార్లీ జావను తీసుకోవచ్చు.
ఉప్పు బార్లీ జావ తయారీ విధానం
-బార్లీ గింజలను శుభ్రంగా కడిగి కనీసం 2-3 గంటలు నీటిలో నానబెట్టండి.
-నానబెట్టిన బార్లీని నీటితో సహా ఒక మందపాటి అడుగుగల పాత్రలో వేయండి.
-మీకు నచ్చిన కూరగాయల తరుగు..క్యారెట్, బఠానీలు, ఉల్లిపాయలు మొదలైనవి వేయండి.
-అందులోనే రుచికి తగినంత ఉప్పు వేసి కలపి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. నీరు మరుగుతున్నప్పుడు పైకి వచ్చే నురుగును తీసివేయండి.
-బార్లీ, కూరగాయలు మెత్తగా ఉడికి జావ లాగా చిక్కబడే వరకు ఉడికించండి. ఇందుకు సుమారు 20-30 నిమిషాలు పట్టవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి.
-జావ ఉడుకుతున్న సమయంలో ఒక చిన్న బాండీలో కొద్దిగా నూనె వేడి చేయండి.
-నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి.
-తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేయించి దీనిని జావలో వేసి బాగా కలపండి. కావాలంటే కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే ఉప్పు బార్లీ జావ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications