Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
బలం, ఆరోగ్యం, రుచి.. ఒకే సున్నుండలో..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
సున్నుండలు పేరు వింటేనే కొందరికి నోట్లో నీళ్లూరుతుంటాయి. తెలుగువారి సాంప్రదాయ పిండి వంటలలో సున్నుండలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మినప సున్నుండలు కేవలం రుచికరమైనవే కాకుండా, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎన్నో ఏళ్లుగా మన పెద్దలు వీటిని పౌష్టికాహారంగా భావించి, పిల్లల ఎదుగుదలకు, బాలింతలకు, బలహీనంగా ఉన్నవారికి ఇచ్చేవారు. సున్నుండలను తయారుచేసుకోవడం చాలా ఈజీ. మీ ఇంట్లోనే సులభంగా మినప సున్నుండలు తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-పొట్టు లేని మినపప్పు- 2 కప్పులు సుమారు 500 గ్రాములు
-బెల్లం లేదా చక్కెర- 1.5 కప్పు
-నెయ్యి - 1 కప్పు
-యాలకుల పొడి - 1 టీస్పూన్
-జీడిపప్పు, బాదం పప్పు-2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
-ముందుగా మినపప్పును ఒక మందపాటి గిన్నెలో లేదా కడాయిలో వేసి తక్కువ మంటపై బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి. దీనికి సుమారు 10-15 నిమిషాలు పట్టవచ్చు.
-వేయించిన మినపప్పును ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-పూర్తిగా చల్లారిన మినపప్పును మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే సున్నుండలు అంత రుచిగా ఉంటాయి. అవసరమైతే జల్లించుకోవచ్చు.
-మిక్సీ పట్టిన మినపపిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో బెల్లం పొడిని లేదా చక్కెరను కలపాలి. బెల్లం అయితే ముందే దాన్ని సన్నగా తురుముకోవాలి లేదా మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇందులోనే యాలకుల పొడిని కూడా కలిపి అంతా బాగా కలిసేలా చేతితో కలపాలి.
-తర్వాత కరిగించిన నెయ్యిని కొద్దికొద్దిగా పిండిలో పోస్తూ కలపాలి. ఒకేసారి మొత్తం నెయ్యి పోయకూడదు.
-పిండిని సున్నుండలు కట్టడానికి వీలయ్యేలా నెయ్యి పోస్తూ కలపాలి.
-జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు వేయాలనుకుంటే వాటిని నెయ్యిలో కొద్దిగా వేయించి ఇప్పుడు పిండిలో కలుపుకోవచ్చు.
-పిండి మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే సున్నుండలు చుట్టడం ప్రారంభించాలి. పూర్తిగా చల్లారిపోతే గట్టిపడి కట్టడం కష్టం అవుతుంది.
-చిన్న చిన్న ఉండలుగా తీసుకుని గుండ్రంగా, గట్టిగా సున్నుండలు చుట్టాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు.
-తయారుచేసిన సున్నుండలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇవి సుమారు 10-15 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
