Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి!
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.!
మన దక్షిణాది వంటకాల్లో తమిళనాడు వంటకాలది ప్రత్యేక స్థానం. తెలుగు, తమిళ వంటకాల రుచులు వేరైనా ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యత. ఈ క్రమంలో తమిళనాట అత్యంత ప్రసిద్ధ చెందిన ఆరోగ్య ప్రదాయిని రెసిపీ వాతకుజంబు రైస్. ఎండు కామంచి గింజలు, ఎండు సుండ కాయలతో చేసే ఈ రెసిపీ.. సంజీవని వంటిదనే చెప్పవచ్చు. అల్సర్‌తో బాధపడేవారు ఈ అన్నం తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా అజీర్తిని తొలగించి ఆకలి కలిగేలా చేస్తుంది. ఈ హెల్తీ రెసిపీ వాతకుజంబు రెసిపీని మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా తయారుచేయాలో చూద్దాం..

తమిళనాడు వాతకుజంబు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
మెంతులు- పావు టీస్పూన్
ఎండు మిర్చి- రెండు
ఇంగువ- పావు టీస్పూన్
ఎండు కామంచి గింజలు- టేబుల్ స్పూన్
ఎండు సుండ గింజలు- టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు- ఆరు
చిన్న ఉల్లిపాయలు- 20
కరివేపాకు- రెండు రెబ్బలు
పసుపు- పావు టీస్పూన్
ఉప్పు- టీస్పూన్
|కారం- రెండు టీస్పూన్లు
ధనియాల పొడి- రెండు టీస్పూన్లు
చింతపండు- నిమ్మకాయ సైజు
బియ్యం అర కప్పు(125 గ్రాములు)
నీళ్లు- నాలుగు కప్పులు
బెల్లం- కొద్దిగా
నెయ్యి- టీస్పూన్
తమిళనాడు వాతకుజంబు రైస్ తయారీ విధానం
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
ఈ వంటకానికి నువ్వుల నూనె వాడితే ఆరోగ్యానికి ఇంకా మంచిది. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత చింతపండును నానబెట్టుకోవాలి.
స్టవ్‌పైన కుక్కర్ పెట్టుకుని వేడయ్యాక నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఇంగువ వేసిన తర్వాత ఎండు కామంచి గింజలు, ఎండు సుండు కాయలు వేసి నూనెలో మగ్గనివ్వాలి.
తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉల్లిపాయలు వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలిపి రెండు నిమిషాల పాటు చిన్న మంటపైన ఉంచాలి.

చింతపండు గుజ్జు వేసి రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా మెత్తబడి ఎసరు ఉడికినప్పుడు బియ్యం వేసుకోవాలి. ఒకసారి కలిపి నాలుగు కప్పుల నీళ్లు పోసి కొద్దిగా బెల్లం వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
విజిల్స్ పూర్తయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయేవరకు అలాగే ఉంచాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలిపి నెయ్యి వేసి మరోసారి కలిపి సర్వ్ చేసుకోవడమే.
హెల్తీ తమిళనాడు స్టైల్ వాతకుజంబు రైస్ రెడీ. ఈ గింజల్లో ఔషధ గుణాలు ఉండటం వల్ల బీపీ, షుగర్ బాధితులు మంచి డైట్ ఆహారంగా తీసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
