Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం!
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
సీజన్‌తో సంబంధం లేకుండా జ్వరం వచ్చినా, జలుబు, దగ్గు లాంటి వైరల్ ఇన్‌ఫెక్షన్స్ పట్టుకున్నా అన్నం, నీళ్లు సహించవు. ఏ కూరతో తినాలనిపించదు. దీంతో రోగనిరోధక శక్తి మరింత బలహీనపడి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మందులు మింగినా త్వరగా తగ్గదు. అందుకే అలాంటి వారి కోసం తల్లులు వంటింట్లో ప్రేమగా, ఘాటుగా చేసే రెసిపీ వెల్లుల్లి కారం. కొద్దిగా, వెల్లుల్లి వేసి దంచి వేడిగా అన్నంలోకి కలిపి తినిపిస్తారు. కానీ అదే వెల్లుల్లి కారంను ఇలా ఎండుమిర్చితో చేస్తే.. తలచుకుంటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది. ఈ అసలుసిసలైన కారం ఘాటు నషాళానికి అంటుకోవడమే కాదు.. గొంతు నొప్పి, జలుబును ఒక్కరోజులో తగ్గించేస్తుంది. ఈ వెల్లుల్లి కారం పచ్చడి రోట్లో వేసి దంచి ఇలా చేసుకోండి.. ప్రతిరోజూ పెట్టినా తింటారు.

వెల్లుల్లి కారం పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
ఎండుమిర్చి- 100 గ్రాములు
వెల్లుల్లి గడ్డలు- ఏడు
జీలకర్ర- మూడు టీస్పూన్లు
పసుపు- టీస్పూన్
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
ఆవాలు- టీస్పూన్
కరివేపాకు- రెండు రెబ్బలు
వెల్లుల్లి కారం పచ్చడి తయారీ విధానం
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.!
ముందుగా వెల్లుల్లి గడ్డలను పొట్టు తీసి పెట్టుకోవాలి. ఒక పది రెబ్బలను తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి. మాడిపోకుండా క్రిస్పీగా వేయించుకోవాలి.

రోట్లో జీలకర్ర వేసి దంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి. వెల్లుల్లి మెత్తగా అయిన తర్వాత దంచిన జీలకర్ర వేసి మరోసారి కలిపి నూరుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు వేయించిన ఎండు మిర్చిని రోట్లో వేసుకుని వీలైనంత మెత్తగా దంచుకోవాలి. ఎండు మిర్చి మెదిగేటప్పుడు రుచికి సరిపడా కల్లు ఉప్పు వేసుకోండి. తర్వాత దంచిన వెల్లుల్లి, జీలకర్ర మిశ్రమం కాస్త పసుపు వేసి అంతా కలిపి మరోసారి దంచుకోండి.
బ్యాచ్‌లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.!
ఉప్పు సరిచూసుకుని ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మూడు ఎండు మిర్చి, కరివేపాకు వేసి కలపాలి. తాలింపు వేగిన తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోండి. మొత్తం కలగలిసేలా గరిటెతో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
అసలు సిసలైన వెల్లుల్లి కారం పచ్చడి రెడీ.. వేడివేడిగా అన్నంలోకి లేదా జొన్న రొట్టెలోకి కాస్త నెయ్యి వేసి కలుపుకొని తింటే ఆ ఘాటుకి స్వర్గంలో ఉన్నట్లు అనుభూతి చెందడం పక్కా.
ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఈ వెల్లుల్లి కారం పచ్చడి తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియాల, యాంటీ వైరల్ లక్షణాలు శరీరంలో వివిధ రోగాలతో పోరాడుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
