Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
వంకాయతో ఇంత రుచా? వంగీబాత్ టేస్ట్‌కి ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే
లంచ్ బాక్సుల్లోకి, అన్నం మిగిలిపోయిన లేదా ఏదైనా ప్రత్యేక సందర్భానికి స్పెషల్ టేస్టీ రెసిపి కావాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా కర్ణాటక స్పెషల్ వంగీబాత్ రెసిపి ట్రై చేయండి. ఏ వయస్సు వారికైనా నచ్చేస్తుంది. చాలా రుచిగా ఉండే వంగీబాత్ ని చేయడం కూడా చాలా ఈజీ. కర్ణాటకలో చాలామంది పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి వంగీ బాత్ నే తింటుంటారు. కర్ణాటక స్టైల్ వంగీబాత్ మీ ఇంట్లోనే ఈజీగా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపప్పు
-నువ్వులు
-ఎండుమిర్చి
-ధనియాలు
-వంకాయలు
-జీడిపప్పు
-కరివేపాకు
-కొత్తిమీర
-ఆయిల్
-ఉప్పు
-పసుపు
-పచ్చిమిర్చి
-టమాటో
-బెల్లం
-ఇంగువ
-చింతపండు
-ఉల్లిపాయ
-వెల్లుల్లిపాయ

తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టీస్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో 10 ఎండుమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ నువ్వులు, 1 టీస్పూన్ శెనగపప్పు, 1 టీస్పూన్ ధనియాలు వేసి తక్కువ మంటమీద రంగుమారి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి. దింపేముందు కొన్ని సెకన్ల ముందు 1 టీస్పూన్ ఎండుకొబ్బరి పొడి వేసి కలుపుకొని దించేసి చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత వాటిన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఆ పొడిని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఓ గిన్నెలో నీళ్లు పోసి అందులో పసుపు వేసి కలిపి పెట్టుకోండి.
-తర్వాత 3 తెల్ల పొడవు వంకాయలను కట్ చేసి ఆ ముక్కలను పసుపు కలిపిన నీళ్లలో వేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక అందులో 2 రెమ్మల కరివేపాకు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ అల్లం తరుగు, 4 వెల్లుల్లిపాయల తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు. 1 చిన్న ఉల్లిపాయ తరుగు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ స్ప్రింగ్ రోల్స్..ఎలా చేసుకోవాలంటే
-ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత అందులో 10-15 జీడిపప్పు, కొంచెం పసుపు, 1 చిన్న టమాటో ముక్కలు వేసి అవి మెత్తగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి.
-ఇప్పుడు అందులో కట్ చేసి పసుపు నీళ్లలో ఉంచిన వంకాయ ముక్కలను కూడా వేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
-ఇప్పుడు అందులో 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు నుంచి తీసిన గుజ్జు , పావు చెంచా ఇంగువ, 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి వంకాయ ముక్కలు మెత్తగా మగ్గేదాకా మగ్గించుకోవాలి.
-తర్వాత అందులో 1 కప్పు ఉడికించుకున్న అన్నం, 3 టేబుల్ స్పూన్ల గ్రైండ్ చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి. అంతే కర్ణాటక స్పెషల్ వంగీబాత్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications