Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
మహారాష్ట్ర స్పెషల్ రగడ చాట్..సాయంత్రం స్నాక్ కు పర్ఫెక్ట్ ఛాయిస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
మన దగ్గర సాయంత్రం అయితే వీధుల్లో స్నాక్స్ గా బోండాలు,బజ్జీలు,వడలు వంటివి అమ్ముతుంటారు. అదే మహారాష్ట్రలో అయితే సాయంత్రం పూట స్నాక్ గా ఎక్కువగా రగడ చాట్ అమ్మేటోళ్లు మనకు కనిపిస్తుంటారు. రఘడ చాట్ అనేది మహారాష్ట్రకు చెందిన ఒక ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్. దీనికి తీపి, పులుపు,కారంగా ఉండే చట్నీలు, ఉల్లిపాయలు, టమాటాలు, సేవ్ వంటి వాటిని పైన చల్లి అందిస్తారు. రఘడ చాట్ రుచిగా ఉండటమే కాకుండా పచ్చి బఠానీలు, ఇతర కూరగాయల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మహారాష్ట్ర స్ట్రీట్ స్టైల్ టేస్టీ రఘడ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రగడ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-తెల్ల బఠాణీలు
-బంగాళదుంప
-టమాటో
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-కారం
-ఉప్పు
-పసుపు
-ఆయిల్
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-జీలకర్ర
-ధనియాల పొడి
-గరం మసాలా పొడి
-జీలకర్ర పొడి
-నిమ్మరసం
-కారపూస
-చాట్ మసాలా పొడి

రగడ చాట్ తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కప్పు తెల్ల బఠాణీలు వేసి ఇందులో సరిపడా నీళ్లు పోసి 8 గంటలు నాననివ్వాలి.
-తర్వాత నానిన బఠాణీలను కుక్కర్ లో వేసేయండి. అందులోనే 2 తరిగిన మీడియం సైజు బంగాళదుంప ముక్కలు,పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు, బంగాళదుంప బఠాణీలు మునిగేంత నీళ్లు పోసి ఒకసారి కలిపి కుక్కర్ మూతపెట్టేయండి.
-మీడియం మంట మీద 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చి స్టవ్ మీద నుంచి కుక్కర్ ని దించేయండి.
-ఇప్పుడు ఓ బాండీని స్టవ్ మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అందులో 1 టీస్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు వేగాక అందులో 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
Best Breakfast: బరువు తగ్గాలనుకుంటే ఈ దోశలు తినాలి..ఆయిల్ లేని చట్నీతో..ఎలా చేసుకోవాలంటే
-ఇప్పుడు అందులో 2 సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేయాలి. టమాటో ముక్కలు మగ్గిన తర్వాత అందులో 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 1 టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ కారం వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఉడికించాలి.
-తర్వాత అందులో ఉడికించిన బంగాళదుంప బఠాణీల మిశ్రమాన్ని పోసి మొత్తం అన్నీ బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇందులోనే పావు టీస్పూన్ గరంమసాలా పొడి వేసి కలిపి మూతపెట్టి తక్కువమంట మీద 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
-తర్వాత మూత తెరిచి అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోండి..కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ రగడ చాట్ రెడీ.
-రగడ చాట్ ని ఓ బౌల్ లోకి తీసుకొని దానిమీద సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా పొడి, కొద్దిగా కారపూస, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి. ఈ రగడ చాట్ ని తింటే మళ్లీ మళ్లీ కావాలనడం పక్కా.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications