Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Best Breakfast: బరువు తగ్గాలనుకుంటే ఈ దోశలు తినాలి..ఆయిల్ లేని చట్నీతో..ఎలా చేసుకోవాలంటే
పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి ఏవి పడితే అవి తిని ఆరోగ్యం పాడు చేసుకునే బదులు జొన్న దోశలు చేసుకొని తినడం ఉత్తమం. రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం దీంతో పొందవచ్చు. జొన్నలు మన ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తాయి. ప్రొటీన్ శాతం అధికంగా ఉండే జొన్నలు గుండెకు మేలు చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ని తగ్గించి, జీర్ణక్రియను పెంచే అప్పుడప్పుడైనా మన డైట్ లో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ జొన్నలతో పొద్దున్నే దోశ చేసుకొని తింటే బరువు కూడా తగ్గొచ్చు. అంతేకాకుండా ఇందులోకి ఆయిల్ లేకుండా చేసే చట్నీని కలుపుకొని తింటే అదిరిపోతుంది. జొన్న దోశ,ఆయిల్ లేని చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పల్లీలు
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-కొత్తిమీర
-మినపగుళ్లు
-మెంతులు
-జొన్నలు
-వెల్లుల్లి
-ఎండుమిర్చి
-ఉప్పు
-నీళ్లు

తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలో 1/3 కప్పు వేయించిన పల్లీలు, పెద్ద ముక్కలుగా కట్ చేసిన 3-4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, కాడలతో సహా కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు, పొట్టు తీసిన 3 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఓ గిన్నెలో ముప్పావు కప్పు పొట్టు తీసిన మినప గుళ్లు, పావు కప్పు పొట్టుతో ఉండే మినపగుళ్లు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 5 ఎండుమిర్చి వేసి ఇందులో నీళ్లు పోసి వీటన్నింటిని రెండు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత నీళ్లు పోసి కనీసం 5-6 గంటలు నాననివ్వాలి.
-ఇప్పుడు మరో గిన్నెలో 2 కప్పుల తెల్ల జొన్నలు వేసి ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తర్వాత నీళ్లు పోసి 6-8 గంటలపాటు నానబెట్టాలి.
-కనీసం 6 గంటల తర్వాత మిక్సీ గిన్నెలో నానబెట్టిన మినపగుళ్ల మిశ్రమం, అరకప్పు అటుకులు కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
మిగిలిన అన్నంతో టేస్టీ,కరకరలాడే వడలు..డీప్ ఫ్రై లేకుండానే..ఎలా చేసుకోవాలంటే
-తర్వాత నానబెట్టిన జొన్నలు కూడా మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు జొన్న పిండి,పప్పు పిండిని మెత్తం కలిపి మూతపెట్టి 6-8 గంటలు అలా వదిలేయాలి.
-8 గంటల తర్వాత పిండి పులిసి పైకి తేలుతుంది. అప్పుడు గిన్నెలోకి ఎంతకావాలో అంత పిండి తీసుకొని అందులో ఉప్పు, నీళ్లు పోసి కలుపుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దోశలు పోసుకోవడమే. అంతే కమ్మని జొన్న దోశలు రెడీ. వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న నూనె లేని చట్నీతో కలిపి తింటుంటే ఆ మజా వేరే లెవల్లో ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
