Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వందల ఏళ్ల నాటి చికెన్ రెసిపి..'దమ్ క ముర్గ్' ఒక్కసారి తింటే జన్మ ధన్యమే..ఎలా చేసుకోవాలంటే
భారతీయ వంటకాల గురించి మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా మొఘలాయ్ వంటకాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దమ్ ముర్గ్ పేరు వినిపించకుండా ఉండదు. ఈ వంటకం కేవలం ఒక ఆహార పదార్థం కాదు, అది చరిత్ర, సంస్కృతి, అద్భుతమైన రుచుల సమ్మేళనం."దమ్" అంటే పదానికి నెమ్మదిగా ఉడికించడం అని అర్థం, "ముర్గ్" అంటే 'కోడి'. పేరుకు తగ్గట్టే ఈ వంటకాన్ని చాలా తక్కువ మంటపై, గాలి చొరబడని పాత్రలో నెమ్మదిగా వండుతారు. ఈ పద్ధతి వల్ల కోడి మాంసం తన సహజ రసాలను నిలుపుకొని, సుగంధ ద్రవ్యాల రుచులను పూర్తిగా పీల్చుకుంటుంది. దీని ఫలితంగా కోడి మాంసం వెన్నలా మృదువుగా మారి ప్రతి ముక్కలోనూ సుగంధాల మత్తు నిండిపోతుంది.
దమ్ వంట పద్ధతికి మొఘల్ చక్రవర్తుల కాలం నుంచే ఘనమైన చరిత్ర ఉంది. మొఘల్ సామ్రాజ్యం భారతదేశానికి అనేక సుగంధ ద్రవ్యాలను, వంట పద్ధతులను పరిచయం చేసింది. దమ్ పద్ధతిలో వంటలు చేయడం వారి రాజ వంటశాలల్లో ఒక ప్రత్యేకత. అప్పటి నవాబులు, రాజులు ఈ పద్ధతిలో వండిన మాంసం వంటకాలను ఎంతగానో ఇష్టపడేవారు. దమ్ ముర్గ్ తయారీలో వాడే పదార్థాలు సాధారణమే అయినప్పటికీ వాటిని కలిపే విధానం, వండే పద్ధతి ఈ వంటకానికి ప్రత్యేకతను తెస్తాయి.
దమ్ క ముర్గ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-కోడి మాంసం: 1 కిలో
-ఉల్లిపాయలు: 3-4 పెద్దవి
-పెరుగు: 1 కప్పు
-అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
-పచ్చిమిర్చి: 3-4
-టమోటాలు: 2
-కొత్తిమీర: గుప్పెడు
-పుదీనా: గుప్పెడు
-నెయ్యి: 4-5 టేబుల్ స్పూన్లు
-పసుపు: 1 టీస్పూన్
-కారం: 1-2 టీస్పూన్లు
-ధనియాల పొడి: 2 టీస్పూన్లు
-జీలకర్ర పొడి: 1 టీస్పూన్
-గరం మసాలా: 1 టీస్పూన్
-బిర్యానీ ఆకు: 2
-దాల్చిన చెక్క: 1 అంగుళం ముక్క
-లవంగాలు: 4-5
-యాలకులు: 3-4
-నల్ల మిరియాలు: 1 టీస్పూన్
-జాజికాయ పొడి: 1/4 టీస్పూన్
-కుంకుమపువ్వు: కొన్ని
-ఉప్పు: రుచికి సరిపడా
ఉదయాన్నే ఆరోగ్యంగా 'జొన్న ఇడ్లీ'..ఇది కదా కావాల్సింది,ఎలా చేయాలంటే
దమ్ క ముర్గ్ తయారీ విధానం
-చిన్న ముక్కలుగా కట్ చేసిన కోడి మాంసాన్ని శుభ్రం చేసి పెద్ద గిన్నెలో తీసుకోండి. దీనికి పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సగం గరం మసాలా, సగం తరిగిన కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసి బాగా కలపండి. కనీసం 1-2 గంటలు లేదా రాత్రంతా ఫ్రిజ్లో ఉంచండి.
-ఒక మందపాటి అడుగున్న పాత్రలో నూనె లేదా నెయ్యి వేడి చేయండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి సువాసన వచ్చేవరకు వేయించండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి, బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించండి.
-వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. కావాలనుకుంటే టమోటా పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించండి. ఇప్పుడు మిగిలిన కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి 2-3 నిమిషాలు వేయించండి.
-మారినేట్ చేసిన కోడి మాంసాన్ని ఈ మసాలాలో వేసి మీడియం మంటపై 5-7 నిమిషాలు వేయించండి. మాంసం రంగు మారే వరకు వేయించాలి.
-పాత్ర అడుగున మాడకుండా, అవసరమైతే కొద్దిగా నీరు పోయండి. సాధారణంగా పెరుగులోని నీరు సరిపోతుంది.
-పాత్రపై మూత పెట్టి దాని చుట్టూ పిండితో సీల్ చేయండి. దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా లోపలే ఉంటుంది.
-మంటను పూర్తిగా తగ్గించి 30-45 నిమిషాలు దమ్ చేయండి. చివర్లో మూతతీసి వేడి పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు, జాజికాయ పొడి, మిగిలిన గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి కలపండి. అంతే దీనిని వేడి వేడి దమ్ ముర్గ్ రెడీ. రోటీలు, నాన్, పరాఠా లేదా జీరా రైస్ తో కలిపి తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






