Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
వర్షాకాలంలో ఆలూ బజ్జి.. పక్కన టీ కూడా..రుచి అద్భుతంగా ఉంటుంది
కూరగాయల్లో బంగాళాదుంపలు అత్యంత ఇష్టమైన కూరగాయలలో ఒకటి. పిల్లలు పెద్దలు అత్యంత ఇష్టంగా తినే దుంప. ఈ బంగాళదుంపలతో తయారుచేసే వంటలు ఏ సమయంలో అయినా ఇష్టంగా తింటారు. బంగాళదుంప కర్రీ, పొటాటో పులావ్, బంగాళదుంపల ప్రై, ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళదుంపల పళ్యం ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ రకాలు వరైటీలు మీ నోటికి అద్భుతమైన రుచిని అందిస్తూ మిమ్మల్ని మంత్రముగ్తులను చేస్తుంది. స్కూల్స్ ప్రారంభం అయినాయి..ఈ సమయంలో పిల్లు ఇంటికొచ్చేసరి ఏం చిరుతిండి తినిపించాలి, ఏం అడుగుతారోనని మీరు ఆందోళన చెందుతుంటే, మీకోసం ఒక సులభమైన రుచికరమైన స్నాక్ రిసిపిని ఇక్కడ అందిస్తున్నామ. మీరు దీన్ని సాయంత్రం స్నాక్ గా మరియు టీ టైం స్నాక్ గా ప్రయత్నించవచ్చు.
మీ కుటుంబంలో ఆలుగడ్డ ను ఇష్టపడే వారు ఎక్కువగా ఉంటే ఆలస్యం చేయకుండా ఈ రిసిపిని మీరు ప్రయత్నించవచ్చు,. మరి దీన్ని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావాల్సిన దార్థాలు:
* బంగాళదుంప - 4 (మీరు సంఖ్యను పెంచుకోవచ్చు)
* శెనగపిండి - 2 కప్పులు
*నీరు - 1 కప్పు
* మిరియాల పొడి - 1 టీస్పూన్
* గరం మసాలా పొడి - 1/2 టీస్పూన్
*ఇంగువ - చిటికెడు
*బేకింగ్ సోడా - రెండు చిటికెలు
*ఉప్పు - రుచికి సరిపడా
*వేయించడానికి సరిపడా నూనె

తయారీ విధానం:
*మొదట మీరు గ్రేటర్ ను ఉపయోగించి బంగాళాదుంపలపై తొక్క తీసేయాలి. .
అన్ని బంగాళాదుంపలను నీటిలో బాగా కడిగి, ఉప్పు నీళ్ళలో వేసి పదిహేను
నిమిషాలు నానబెట్టండి.
* తర్వాత ఆ నీటిని వంపేసి బంగాళదుంపులను మీకు నచ్చిన సైజ్ లో ఆకారంలో
కట్ చేసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి.
* ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శెనగ పిండి, కారం, గరం
మసాలా పొడి, బేకింగ్ సోడా, ఇంగువ, ఉప్పు అన్నీ వేయాలి. ఈ పదార్థాలన్నీ
బాగా కలపాలి.
*ఈ గిన్నెలో సరిపడా నీరు పోసి మొత్తం మిశ్రంను బాగా కలుపుకోవాలి,
అందులోని పదార్థాలన్నింటినీ మీ చేతులతో మెత్తగా కలపండి. పిండిని
నీటితో బాగా కలపండి. ఇలా చేస్తున్నప్పుడు ముడులు లేవని
నిర్ధారించుకోండి.
* తరువాత, ఈ పిండిలో ముందే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను
వేసి బాగా కలపాలి. అన్ని బంగాళాదుంప ముక్కలను కూడా పూర్తిగా పిండితో
మ్యారినేట్ చేసిన విధంగా కలుపుకోవాలి.
* ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి , అందులో డీప్ ప్రైకి సరిపడా నూనె
పోసి తక్కువ మంట మీద వేడి చేయడం ప్రారంభించండి. నూనె వేడి అయిన
తర్వాత, నెమ్మదిగా పిండితో పూసిన బంగాళాదుంప ముక్కలను వేడి నూనెలో
వేయాలి
*బంగాళదుంప ముక్కలను వేడి నూనెలో బాగా వేయించాలి. రెండు వైపులా బాగా
వేయించాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేవరకు బాగా వేయించాలి.
* అంతలోపు ఒక గిన్నెలో అడుగు బాగంలో టిష్యు పేపర్ వేసి వేగించిన
బంగాళాదుంప బజ్జీలను అందులో వేయాలి. టిష్యూ అదనపు నూనెను
పీల్చుకుంటుంది. ఇంట్లో తయారుచేసిన సింపుల్ఆ అండ్ టేస్టీ ఆలూ బజ్జీ
తినడానికి రెడీగా ఉన్నాయి. మీరు ఈ స్నాక్ ను టొమాటో సాస్ లేదా చిల్లీ
సాస్‌తో ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications