Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
ఆలూ - గోబీ పులావ్: టేస్టీ అండ్ ఈజీ
మీరు చాలా త్వరగా మరియు సులభంగా ఏదైనా వండాలనుకుంటున్నారా?అటువంటప్పుడు ఈ ఆలూ గోబీ రిసిపి చాలా సులభం మరియు రుచికరంగా ఉంటుంది. బంగాళదుంప మరియు కాలీఫ్లవర్ కాంబినేషన్ లో మీరు చాలా సులభంగా తయారుచేయవచ్చు. ఈ పలావ్ రిసిపికి కొన్ని మసాలా దినుసులు జోడించడం వల్ల అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది.
ఆలూ-గోబీ పులావ్ పూర్తిగా మీల్ రిసిపి. దీన్ని బాస్మతి రైస్ తో తయారుచేస్తారు. ఈ మూడింటి కాంబినేషన్ లో ఆరోమా వాసనతో పులావ్ నోరూరిస్తుంటుంది. మరి మీరు కూడా టేస్ట్ చేయాలకుంటే ఒక సారి ప్రయత్నించి చూడండి...

కావల్సిన పదార్థాలు:
బంగాళాదుంప ముక్కలు : 3 / 4cup(పైపొట్టు తొలగించినవి)
కాలీఫ్లవర్ పుష్పాల: 1cup
బాస్మతి బియ్యం: 3cups(నీటిలో నానబెట్టి తర్వాత నీరు వంపేయాలి)
నెయ్యి: 2tbsp
దాల్చిన చెక్క: 1
లవంగాలు: 5
బిర్యానీ ఆకు:2
పసుపు: 1/2 tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ప్రెజర్ కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేసి, అందులో దాల్చిన చెక్క, లవంగాలు మరియు బిర్యానీ ఆకు వేసి కొన్ని నిముషాలు వేయించుకోవాలి.
2. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగిపెట్టుకొన్న బియ్యం వేసి 1 లేదా 2 నిముషాలు వేయించుకోవాలి.
3. ఇప్పుడు అందులో కాలీఫ్లవర్, పొటాటో, బియ్యం, పసుపు, కారం మరియు ఉప్పు వేసి మీడియం మంట మీద ఒక నిముషం వేయిచంుకోవాలి.
4. తర్వాత అందులో మూడున్నర కప్పుల నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి రెండు బిజల్స్ వచ్చే వరకూ కుక్కర్ లో ఉడికించుకోవాలి.
5. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కొంత సమయం అలాగే ఉంచి, ఆవిరి మొత్తం తగ్గే వరకూ అలాగే ఉంచి తర్వాత మూత తీయాలి అంతే ఆలూ గోబీ పలావ్ రెడీ. వెజిటేబుల్ రైతాతో గార్నిష్ చేయాలి.



Click it and Unblock the Notifications