Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
ఆలూ పచ్చిబఠానీ కర్రీ : వీకెండ్ స్పెషల్ -వీడియో..!!
ప్రత్యేకమైన వంటలు తయారీ గురించి వెతుకుతూ ఒక్కోసారి మామూలు వంటలని మర్చిపోతుంటారు.ప్రత్యేక వంటలని పందుగలూ, పబ్బాలప్పుడే చేసుకోవాలని మీలో చాలా మంది అనుకుంటారు కదా.కానీ ప్రతీ రోజూ మీ వంటల్లో చిన్న చిన్న మార్పుల ద్వారా బోలెడు రుచి తీసుకురావచ్చు.అలూ మటర్ కూర చాలా ఇళ్ళల్లో సాధారణంగా చేసే కూర.దీనిలో పచ్చి బఠాణీలు మరియూ అలూతో పాటు ఇతర మసాల దినుసులుంటాయి. లంచ్ కావచ్చు లేదా డిన్నర్ కావచ్చు, రైస్ లేదా రోటీ దేనితోనైనా ఈ కూర బాగుంటుంది.
ఈ కూరని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో లాగ చేస్తారు.రాజస్థాన్లో చేసే ఆలూ మటర్ పంజాబ్‌లో చేసే దానికి భిన్నం.మీరు కనుక ఈ కూరని ఎప్పుడూ ప్రయత్నించి ఉండకపోతే కనుక అసలు ఈ కూరకి ఏమేమి కావాలో, దీనిని పంజాబీ స్టైల్లో ఎలా చెయ్యాలో వివరించాము చూడండి.
ఎంత మందికి సరిపోతుంది-4
సామాన్లు సమకూర్చుకోవడానికి-10 నిమిషాలు
వండటానికి పట్టే సమయం-20 నిమిషాలు
కావాల్సిన పదార్ధాలు:
1.నూనె-2 టేబుల్ స్పూన్లు
2.జీలకర్ర-1/2 టీ స్పూను
3.ఉల్లిపాయలు-సన్నగా తరిగినవి 3/4కప్పు
4.వెల్లుల్లి-సన్నగా తరిగినది ఒక టీస్పూను
5.అల్లం- సన్నగా తరిగినది ఒక టీస్పూను
6.పచ్చి కిర్చి పేస్టు-ఒక టీ స్పూను
7.టమాటాలు-సన్నగా తరిగినవి 1 కప్పు
9. పచ్చి బఠాణీ-ఉడికించినవి 1 కప్పు
10. ఆలుగడ్దలు--ఉడికించినవి 1 1/2 కప్పు
11 ఉప్పు-తగినంత
12.కారం-1 1/2 టీ స్పూను
13.గరం మసాల-1/2 టీ స్పూను
14.పసుపు-చిటికెడు
15.కొత్తిమీర-సన్నగా తరిగినది 1 టీ స్పూను
తయారీ విధానం:
1.ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని దానిలో నూనె వేసి వేడి చెయ్యాలి.

2.నూనె వేడెక్కాకా దానిలో జీల కర్ర వేసి చిటపటలాడూతుంటే తరిగిన ఉల్లిపాయలు వేసి కలపాలి.
3.ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి వచ్చే వరకూ కలుపుతుండాలి.

4.ఇప్పుడు ఉల్లిపాయలకి వెల్లుల్లి, అల్లం,టమాటాలు, పచ్చి మిర్చి పేస్టు వేసి ఒక స్పూను నీళ్ళు కలిపితే టమాటాలు బాగా ఉడుకుతాయి.
5.ఇప్పుడు ఉడికిన టమాటాలని బాగా మెత్తగా అయ్యే వరకూ గరిటెతో మెదిపి, మసాలాలన్నీ బాగా ఉడికాకా దానిలో పచ్చి బఠాణీ మరియూ ఆలుగడ్డ కలపాలి.

6.ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి.
7.ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోసి కూరని బాగా ఉడకనివ్వాలి.

8.ఉడికేటప్పుడు ఆలు గడ్డలని మెదిపితే కూర చిక్కబడుతుంది.
9. అంతే మీ ఆలూ మటర్ కూర తయారు.స్టవ్ ఆపి ఈ కూరని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
10. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించడమే.

ఈ కూర ఎంత సులభమో కదా. ఈ కూర ఎంత రుచిగా ఉంటుందంటే మీరు బ్రెడ్‌తో కూడా దీనిని తినచ్చు.కూరగాయలంటే ఆమడ దూరం పారిపోయే పిల్లలు కూడా ఈ కూరని వేడి అన్నం లేదా రోటీలతో తినడానికి ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications