Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
బేబీ కార్న్ ఫ్రై : స్పెషల్ సైడ్ డిష్
తల్లి కార్న్‌తో... అంటే దేశవాళీ మొక్కజొన్నలతో గారెలు, బూరెలు వగైరా చేసుకుని తింటాం. మరి పిల్ల కార్న్‌తో! దాంతో కూడా కూరలు, అన్నాలు లాంటివెన్నో చేసుకోవచ్చు. బేబీకార్న్‌ను మీగడతో కలిపితే కమ్మగా, పనీర్, పాలక్‌లతో చేరిస్తే పసందుగా కూరలు సిద్ధమైపోతాయి. శెనగలతో కలిపి రైస్ చేశారంటే బిర్యానీ రైస్ బలాదూరే. పులావ్ వండిపెడితే పళ్లెం ఖాళీ చేసేస్తారు. ఇవే కాకుండా టీ టైం స్నాక్‌లుగా కూడా మారి కరకరలాడతాయి. పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టు పేరులోనే పిల్ల కాని రుచిలో మాత్రం పెద్దదే ఇది.
మార్కెట్లో బేబీ కార్న్ కనిపించగానే ఆసక్తిగా వాటి దగ్గరికెళ్తాం. కానీ వాటిని ఎలా వండాలో తెలియక చివరికి కొనకుండానే ఇంటికొచ్చేస్తూ ఉంటాం. ఇకముందు అలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. బేబీకార్న్‌తో నోరూరించే ఈ రెసిపీలను ట్రై చేసి ఇంటిల్లిపాదినీ ఆశ్చర్యపరచండి..

కావాల్సిన పదార్ధాలు
బేబికార్న్: 7
టమాట: 1
క్యాప్సికమ్: 1
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
ఉల్లిపాయ: 1
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 1/2tsp
నిమ్మరసం: కొద్దిగా
జీలకర్ర: 1tsp
ధనియాలపొడి: 1tsp
శనగపిండి: 1tsp
బియ్యంపిండి: 1tsp
మైదాపిండి: 1tsp
తగినంత నూనె: 1tsp
పసుపు: 1/4tsp
తయారు చేయు విధానం
1. ముందుగా బేబికార్న్ నాలుగు భాగాలు నిలువుగా కట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు ఒక బౌల్ లో మైదా, శనగపిండి, బియ్యంపిండి, పసుపు, అల్లంవెల్లుల్లిపేస్ట్, ఉప్పు, కారం, సరిపడా నీళ్ళు పోసి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి.
3. తర్వాత ఈ మిశ్రంలో బేబికార్న్ వేసి కలిపి నూనెలో వేయించుకుని ప్లేట్ లోకి తీసుకుని పెట్టుకోవాలి.
4. ఫ్రై చేసిన బేబీకార్న్ ముక్కలమీద జీలకర్రపొడి, ధనియాలపొడి, నిమ్మరసం, ఉల్లిముక్కలు, వేసి క్యాప్సికమ్, టమాట, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications