Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
బేబీ కార్న్ ఫ్రై: స్పైసీ స్టాటర్స్ రిసిపి
తల్లి కార్న్‌తో... అంటే దేశవాళీ మొక్కజొన్నలతో గారెలు, బూరెలు వగైరా చేసుకుని తింటాం. మరి పిల్ల కార్న్‌తో! దాంతో కూడా కూరలు, అన్నాలు లాంటివెన్నో చేసుకోవచ్చు. బేబీకార్న్‌ను మీగడతో కలిపితే కమ్మగా, పనీర్, పాలక్‌లతో చేరిస్తే పసందుగా కూరలు సిద్ధమైపోతాయి. శెనగలతో కలిపి రైస్ చేశారంటే బిర్యానీ రైస్ బలాదూరే. పులావ్ వండి పెడితే పళ్లెం ఖాళీ చేసేస్తారు. ఇవే కాకుండా టీ టైం స్నాక్‌లుగా కూడా మారి కరకరలాడతాయి. పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టు పేరులోనే పిల్ల కాని రుచిలో మాత్రం పెద్దదే ఇది.
మార్కెట్లో బేబీ కార్న్ కనిపించగానే ఆసక్తిగా వాటి దగ్గరికెళ్తాం. కానీ వాటిని ఎలా వండాలో తెలియక చివరికి కొనకుండానే ఇంటికొచ్చేస్తూ ఉంటాం. ఇకముందు అలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. బేబీకార్న్‌తో నోరూరించే ఈ రెసిపీలను ట్రై చేసి ఇంటిల్లిపాదినీ ఆశ్చర్యపరచండి.. మీ కోసం ఒక స్పెషల్ బేబీ కార్న్ స్ట్రాటర్స్ ...

కావల్సిన పదార్థాలు:
బేబీకార్న్: 15
పెరుగు: 1/2cup
జీలకర్ర: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
మైదా: 1/2cup
మొక్కజొన్న పిండి: 1/2cup
నిమ్మరసం: 1/2tsp
కారం : 1/2tsp
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా బేబీ కార్న్ శుభ్రంగా కడిగి రెండు పొడవు ముక్కల్లా చేసుకోవాలి. ఓ గిన్నెలో సగం దాకా నీళ్ళు పోసి అందులో ఈ బేబీకార్న్ ముక్కలు వేసి స్టౌ మీద పెట్టాలి . నీళ్ళు కొద్దిగా వేడి అయ్యాక బేబీకార్న్ ముక్కల్ని వేయాలి.
2. నీళ్లు మరిగాక దిపంేసి బేబీకార్న్ ని వేడినీటిలోనే ఉంచి తర్వాత పెట్టేయాలి. ఐదునిముషాలయ్యాక నీటిని వంపేయాలి.
3. ఓ గిన్నెలో పెరుగు, తగినంత ఉప్పు, చెంచా జీలకర్రపొడి తీసుకొని బాగా కలపాలి. ఇందులో బేబీకార్న్ ని వేసి వాటిని పెరుగు బాగా పట్టేలా కలిని ఒక గంటసేపు అలాగే ఫ్రిజ్ లో ఉంచాలి.
4. అంతలోపు, మైదా, మొక్కజొన్నపిండి, మిగిలిన జీలకర్రపొడి, కారం, మరికొంచెం ఉప్పు, నిమ్మరసం ఓ గిన్నెలో తీసుకొని నీళ్ళు పోసుకుంటూ చిక్కని పిండిలా కలుపుకోవాలి.
5. తర్వాత ఫ్రిజ్ లో ఉంచిన బేబీకార్న్ ని వెలుపలి తీసి మైదా మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేయాలి.
6. అన్ని వైపులా ఎర్రగా వేగిన తర్వాత పక్కకు తీసేయాలి. ఇలా మిగిలిన బేబీ కార్న్ కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే మీకు నచ్చిన కచెప్ తో వేడి వేడిగా తింటే రుచికరంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications