Latest Updates
-
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే!
బేండి (బెండకాయ) కుర్మ: రైస్, రోటి కాంబినేషన్
ఓక్రా ని ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు లేడిస్ ఫింగర్,భిండీ మరియు బెండకాయ అనే పేర్లతో పిలుస్తారు. సౌత్ ఇండియన్ వంటకాల్లో బెండకాయ మసాలా చాలా పాపులర్. బెండకాయను వివిధ రకాలుగా..వివిధ పద్థతుల్లో తయారుచేవచ్చు. వీటన్నింటి పూర్తి విరుద్దుమైన మరియు ఓ అద్భుతమైన రుచితో తయారుచేయబడింది. ఈ బేండి మాసాలకు క్రీమీ మరియు కొద్దిగా పుల్లగా ఉండే ఈ బేండి మసాలా చాలా అద్భుతంగా ఉంటుంది.
సాధారణంగా, ఆలూ, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, బీన్స్, క్యారెట్ వంటి వెజిటేబుల్స్ తో కుర్మా వండుతుంటారు. స్పెషల్ గా బెండకాయ కుర్మా కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ రుచికరమైన బెండకాయ కుర్మా రైస్, చపాతీకి బెస్ట్ కాంబినేషన్ రిసిపి.

కావలసిన వస్తువులు :
బెండకాయలు: 1 kg
టమాట: 2
ఉల్లిపాయ: 1
పసుపు: 1/4 tsp
కారం పొడి: 1 tsp
ఉప్పు: తగినంత : 1/4 tsp
గరం మసాలా పొడి: 1/4 tsp
ధనియాల పొడి: 1 tbsp
అల్లం , వెల్లుల్లి పేస్ట్: 1 tsp
కొబ్బరి పొడి: 2 tbsp
గసగసాలు: 1 tsp
పెరుగు: 1/4 కప్పు
కొత్తిమిర: 2 రెమ్మలు
కరివేపాకు: 1 రెమ్మ
నూనె: 3 tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా బెండకాయలను కడిగి , గుడ్డతో తుడిచి అంగుళం సైజులో ముక్కలు చేసుకోవాలి.
2. అలాగే టమాటాలు నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడేవరకు వేయించాలి.
4. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసి మరి కొద్దిసేపు వేయించి బెండకాయ ముక్కలు వేసి మెల్లిగా కలుపుతూ వేయించాలి. మూత పెట్టకూడదు. దీనివల్ల ముక్కలు విరిగిపోవచ్చు. బంకగా అవుతాయి. పొడిపొడిగా ఉండాలంటే మూతపెట్టకుండా వేయించాలి.
5. తర్వాత టమాట ముక్కలు, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలు వేగనివ్వాలి.
6. అంతలోపు గసగసాలు వేయించి కొబ్బరితో కలిపి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసి కలపాలి.
7. బెండకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ధనియాల పొడి,కొబ్బరి గసగసాల పేస్ట్ ఇందులో వేసి అరకప్పు నీరు పోసి కలిపి నిదానంగా సుమారు ఐదునిమిషాలు ఉడకనివ్వాలి.
8. కూర దగ్గరపడ్డాక గరం మసాలా సన్నగా తరిగిన కొత్తిమిర వేసి దింపేయాలి. ఘుమఘుమలాడే బెండకాయ కుర్మా తయారైపోయింది. చాలా తొందరగానే ఈ స్పైసీ వంటకం తయారవుతుంది. అన్నంలోకి, చపాతీల్లోకి చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications