Latest Updates
-
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే!
బ్రెడ్ పాన్ కేక్-హెల్తీ అండ్ ఈజీ బ్రేక్ ఫాస్ట్
బ్రెడ్ పాన్ కేక్ లేదా బ్రెడ్ ఊతపం అనికూడా అనవచ్చు. ఇది బ్రెడ్ పాన్ కేక్ రిసిపి వెరీ హెల్తీ మరియు టేస్టీ బ్రేక్ ఫాస్ట్. ఇది చూడటానికి రవ్వ పాన్ కేక్ లా అనిపిస్తుంది. కానీ ఇది పూర్తి డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది.
మంచి ఫ్లేవర్ టేస్ట్ కొరకు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ను మిక్స్ చేసుకోవచ్చు. ఇది పిల్లల లంచ్ బాక్స్ కు సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇది త్వరగా సులభంగా తయారు చేసుకొనే బ్రేక్ ఫాస్ట్ రిసిపి. మరి మీరు బ్రెడ్ పాన్ కేక్ రుచి చూడాలంటే మీరు ట్రై చేసి చూడండి
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసులు: 10
పాలు: 1cup
ఉల్లితరుగు: 1/2cup
క్యాప్సికమ్ తరుగు: 1/2cup
టొమాటో తరుగు: 1/2cup
బంగాళదుంప తురుము: 1/2cup
పచ్చిమిర్చి: tbsp
అల్లం తురుము: 1tbsp
కొత్తిమీర తరుగు: 2tbps
ఉప్పు: రుచికి తగినంత
కారం: 1/2tsp
గరంమసాలా: 1/2tsp
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా బ్రెడ్ స్లైసుల అంచులను తీసేసి, బ్రెడ్ ను పొడిలా చేసి, అర కప్పు పాలలో పదినిముషాలు నానబెట్టాలి.
2. తర్వాత పాలు తప్ప మిగిలిన వస్తువులన్నీ ఒక గిన్నెలో వేసి, నూనె కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి.
3. తర్వాత పాలు జతచేసి దోసె మిశ్రమంలా తయారుచేయాలి కొద్దిగా జిగురుగా ఉండాలి. లేదంటే మరీ మెత్తగా అయిపోయి, సరిగా రావు.
4. ఇప్పుడు స్టౌ మీద పాన్ ఉంచి, వేడయ్యాక నూనె రాయాలి తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పెనం మీద వేసి, దోసె మాదిరిగా కొద్దిగా మందంగా వేయాలి. గోధుమరంగులోకి మారాక రెండవవైపులా తిప్పి కాలనివ్వాలి. అంతే బ్రెడ్ పాన్ కేక్ రెడీ



Click it and Unblock the Notifications
