Latest Updates
-
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే!
క్యాబేజ్ పెప్పర్ సూప్ : బరువు తగ్గడానికి
దీపావళి మొదలుకొని అన్ని పండగులు, ఫంక్షన్లు, క్రిస్మస్ సెలబ్రేషన్స్, పార్టీలు అన్ని పూర్తి అయ్యాయి. ఈ ఫెస్టీవ్ సీజన్ సందర్భంగా దాదాపు ప్రతి ఒక్కరూ క్యాలరీలు అధికంగా ఉండే ఫుడ్స్ మరియ డిజర్ట్స్ తిని ఉంటారు. అయితే, అన్ని సమయాలోనూ అటువంటి ఆహారాలను తినడానికి ఏ మాత్రం తినకుండా మీఅంతట మీరు స్వయంగా తగ్గించుకోవాలి. కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తర్వాత మీరు మీ డైట్ ను తిరిగి అనుసరించాల్సిందే...
అందువల్ల మీరు కొంత అదనపు క్యాలరీలను పొంది ఉండవచ్చు మరియు బరువు తగ్గించకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తుండవచ్చు, అటువంటి సమయంలో కొన్ని బరువు తగ్గించే, జీరో క్యాలరీ డిష్ లను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీలో కొన్ని కొవ్వు కణాలను కరిగించేకోవచ్చు.
అందులో ముఖ్యంగా సూప్ డైట్ చాలా పాపులర్ అయినటువంటి డిష్ మరియు ఇది బరువు తగ్గించడంలో చాలా అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, ఈ సీజన్ లో మీకు అందుబాటులో ఉండే కొన్ని వెజిటేబుల్స్ ను ఉపయోగించి సూప్స్ తయారుచేసి, బరువు తగ్గించుకోండి. మీకోసం బరువు తగ్గించే ఒక వింట్ సూప్ క్యాబేజ్ పెప్పర్ సూప్...

క్యాబేజీ-1(తురుము)
క్యారెట్- 2లేదా3 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
మొక్కజొన్న పిండి-½tsp
నల్ల మిరియాలు: 1tsp (పొడి)
ఉప్పు: రుచికి సరిపడా
వెన్న: 1tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా తరిగి పెట్టుకొన్నవెజిటేబుల్స్ అన్నింటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో నీరు పోసి వేడిచేయాలి.
3. నీరు మరుగుతుండగా అందులో కట్ చేసి పెట్టుకొన్న క్యాబేజ్, క్యారెట్ మరియు ఉల్లిపాయ ముక్కలను వేయాలి.
4. ఈ పదార్థాలను కొద్దిగా ఉప్పు జోడించి బాగా మిక్స్ చేసి, ప్రెజర్ కుక్కర్ లో 3-4విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
5. 3, 4 విజిల్స్ వచ్చిన తర్వాత క్రిందికి దింపుకొని, పక్కకు తీసి 5 అలాగే ఉంచి తర్వాత మూత తీయాలి.
6. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా బట్టర్ వేసి, కరిగిన తర్వాత ముందుగా కుక్కర్ లో ఉడికించి పెట్టుకొన్నవెజిటేబుల్ సూప్ వేసిమిక్స్ చేయాలి. తర్వాత అందులోనే బ్లాక్ పెప్పర్ మరియు సాల్ట్ వేయాలి.
7. ఈ రెండూ కొద్దిగా కొద్దిగా చిక్కగా మారుతుండగా అందులో కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
అంతే పెప్పర్ మరియు క్యాబేజ్ సూప్ రెడీ . వేడి వేడిగా సర్వ్ చేయాలి . ఇది జలుబుతో పోరాడుతుంది మరియు చల్లని వాతారవణంలో మీ శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications