Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
కాలీఫ్లవర్ టమోటో కర్రీ

కాలిఫ్లవర్: 2cups(విడుపించుకోవాలి)
టమోటోలు:3
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4-6
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: చిటికెడు
కొత్తిమిర తురుము: 2tbsp
పోపుకోసం:
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ఎండు మిర్చి:2-4
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా నీళ్ళను వేడిచేసుకొని వేడి నీళ్ళలో కాలీఫ్లవర్ చిన్న చిన్న పీసులుగా విడిపించుకొని , కొద్దిగా ఉప్పుతో వేడినీళ్ళలో వేసి ఐదు నిమిషాల తర్వాత బయటకు తీసేసుకోవాలి.
2. తర్వాత టమోటోలు, ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులన్నీ కలిపి వేయించుకోవాలి.
4. పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
5. ఇప్పుడు అందులో కాలీఫ్లవర్ వేసి మరో ఐదే నిమిషాలు వేయించి తర్వాత టమోటో ఉప్పు, పసుపు, కారం వేసి మరో పదిహేను నిమిషాలు వేయించాలి.
6. కాలీఫ్లవర్ మెత్తగాఉడికిందో లేదో చూసి మరో రెండు నిమిషాల తర్వాత ఉడికించి చివరగా కొత్తిమీర తరుగును గార్నిష్ చేసుకోవాలి. అంతే వేడి వేడి కాలీఫ్లవర్ టమోటో కర్రీ రెడీ. దీనని చపాతీ , వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications