Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
రుచికరమైన అఛారీ గోబి రిసిపి
కాలీఫ్లవర్ తో వివిధ రకాల వంటలను తయారుచేయవచ్చు. కాలీఫ్లర్ వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆచారీ గోబీ రిసిపి రెగ్యులర్ వంటలకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ వంటను కొన్ని బేసిక్ పదార్థాలతో తయారుచేస్తారు. ఈ పదార్థాలన్నింటీ ఊరగాయలు తయారుచేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు.
స్పైసీ ఆచారి పన్నీర్ పులావ్:క్లిక్ చేయండి
ఈ టేస్టీ ట్యాంగీ వెజిటేరియన్ రిసిని మీ టేస్ట్ బడ్స్ ను మరింత టేస్టీగా తయారుచేస్తుంది మరియు కాలీఫ్లవర్ వంటలను మరింత ఇష్టంగా తింటారు. ఈ అచారీ గోబిని సైడ్ డిష్ గా వడ్డిస్తే మరింత టేస్టీగా ఉంటుంది. దీన్ని పిల్లల్లు కూడా ఇష్టంగా తింటారు. ఈ స్పెషల్ టేస్ట్ కోసం కొంత వెరైటీగా ఆమ్చూర్ పౌడర్ ను మిక్స్ చేసి తయారుచేయవచ్చు.

కావల్సిన పదార్థాలు:
కాలీఫ్లవర్: 3cups (చిన్న పువ్వులుగా కట్ చేసుకోవాలి)
ఆలివ్ ఆయిల్: 4tbsp
ఉల్లిపాయ: 1 కప్
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
టమోటో గుజ్జు: 2tbsp
పెరుగు: 2tbsp
ఆచారి మసాలా: 1tbsp
కారం: ½ tsp
ఉప్పు: రుచికి సరిపడ
నిమ్మరసం: 1tsp
ఆమ్చూర్ పొడి: ½tsp
తాజా కొత్తిమీర: 2tbsp (తరిగిన)
ఆమ్చూర్ మసాలా పౌడర్ కోసం:
ఎండు మిర్చి: 16-18
ధనియాలు: 1tbsp
ఉల్లిపాయ విత్తనాలు: 3tsp
సోంపు: 6tbsp
ఆవాలు: 6tbsp
మెంతులు / మెంతుల్లో: 2tsp
జీలకర్ర: 6tsp
ఉప్పు: 6tbsp
పసుపు: 3tbsp
ఇంగువ: ½tsp
డ్రై మామిడి పొడి: 3tsp
తయారుచేయు విధానం:
డ్రైమాయిడి పొడి తయారుచేయు విధానం:
1. ఎండుమిర్చి, ధనియాలు, ఉల్లిపాయ విత్తనాలు, సోంపు, ఆవాలు, మరియు జీలకర్ర లైట్ గా రోస్ట్ చేయాలి.
2. తర్వాత వీటిని పక్కకు తీసుకొని 5నిముషాలు వేయించుకోవాలి.
3. తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
4. ఈ పొడిని మూత గట్టిగా ఉన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది రెండు నెలల వరకూ నిల్వ ఉంటుంది.
ఆమ్చూర్ గోబి తయారుచేయు విధానం:
1. పాన్ లో రెండు చెంచాలా నూనె వేసి, అందులో శుభ్రంగా కడిగి పెట్టుకొన్న కాలీఫ్లవర్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో, 2చెంచాలా నూనె వేసి, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
3. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకనిముషం వేయించుకోవాలి .
4. ఇప్పుడు అందులో టమోటో జ్యూస్ మరియు పెరుగు వేసి మరో నిముషం వేయించుకోవాలి.
అచరి చికెన్: క్లిక్ చేయండి
5. ఇప్పుడు అందులో ఆమ్చూర్ మసాలా, కారం, ఉప్పు మరియు అరకప్పు నీళ్ళు పోసి మరో నిముషం వేయించుకోవాలి.
6. మూత పెట్టి ఒక నిముషం వేయించుకోవాలి . ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసుకొన్నకాలీఫ్లవర్ వేసి వేయించుకోవాలి.
7. తర్వాత చివరగా అందులో నిమ్మరసం మరియు ఆమ్చూర్ పౌడర్ వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసి తాజా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడి గా పుల్కా లేదా దాల్ రైస్ తో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications