కార్న్ పులావ్ రిసిసి: స్పైసీ డిష్

కార్న్ పులావ్ రిసిపి చాలా సులభమైనటువంటి ఒక టేస్టీ డిష్. కార్న్ మరియు నెయ్యి, బియ్యంతో తయారుచేసే ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. వింటర్ సీజన్ లో మార్కెట్లో కార్న్ అందుబాటులో ఉంటాయి కాబట్టి, ప్రెష్ గా దొరికే కార్న్ తీసుకొచ్చి హెల్తీగా మరియు టేస్టీగా పులావ్ ను తయారుచేసుకోవచ్చు.

ఈ డిష్ కొన్ని ఇండియన్ మసాలాదినుసులు జోడించి చాలా డిఫరెంట్ గా తయారుచేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది. ఈ డిఫ్ పిల్లలకు మరియు పెద్దలకు ఇద్దరికి ఎక్కువగా నచ్చుతుంది. మరి ఈ హెల్తీ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Easy to cook spicy corn pulao

కావల్సిన పదార్థాలు:
ఉల్లిపాయ: 1 (నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో : (2 బాగాలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: : 4-5
అల్లం: 1/2 అంగుళం(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2
ధనియాల పొడి : 1tbsp
గరం మసాలా : 1/4tbsp
మిరప పొడి: 1tbsp
పసుపు పొడి: 1/4tbsp

డిష్ కోసం
బాస్మతి రైస్: 1cup
అమెరికన్ మొక్కజొన్న: 3/4cup
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిబఠానీలు: 1/2cup
బ్లాక్ యాలకలు: 2
లవంగాలు: 3
దాల్చిన చెక్క: 1
జీడిపప్పు: 8
బిరియానీ ఆకు: 1
కుంకుమపువ్వు: 1 చిటికెడు
కొత్తిమీర-1tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పాలు: 1tbsp
Ghee- 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు, పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీలో, మసాలా కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్ని వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద కడాయ్ పెట్టి వేడయ్యాక అందులో నెయ్యివేసి కరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకొన్న బియ్యం వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, మరియు బిర్యానీ ఆకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
6.ఇప్పుడు అందులోనే ఉల్లి పాయ ముక్కలు మరియు పచ్చిబఠానీలు వేసి ప్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు చిలకరిస్తే ఉల్లిపాయ త్వరగా ఉడుకుతుంది.
7. ఇప్పుడు అందులోనే కార్న్ కూడా వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. ఆ తర్వాత, అందులో నెయ్యిలో ఫ్రై చేసుకొన్న బియ్యం వేసి 1:2 రేషియో ప్రకారం(1కప్పు బియ్యంకు రెండు కప్పుల నీళ్ళు )పోయాలి మరియు అందులోనే ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
9. మొత్తం మిశ్రమాన్ని కలగలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఎక్కువ మంట మీద 10నిముషాల ఉడికించాలి. ఒకటి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి.
10. అంతలోపు జీడిపప్పును నెయ్యిలో వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
11. ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీసి ముందుగా పాలలో నానబెట్టుకొన్న కుంకుమపువ్వును పాలతో సాహా అన్నం మీద పోయాలి, దీనితో పాటు, కొత్తిమీర తరుగు, ఫ్రై చేసిన జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. చివరగా కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క మరికొన్ని ఇండియన్ మసాలాలను గార్నిష్ చేయాలి అంతే కార్న్ ఫులావ్ రిసిపి రెడీ.

Story first published: Wednesday, December 10, 2014, 17:57 [IST]
Desktop Bottom Promotion