Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
ఎగ్ వైట్ ఓట్ మీల్ ఆమ్లెట్ : హెల్తీ బ్రేక్ ఫాస్ట్
బరువు తగ్గించే వంటలేవైనా ఉన్నాయా అంటే? ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఓట్స్ బాగా పాపులర్ అయినాయి. బరువు తగ్గించడంలో ఓట్స్ అద్భుతంగా సహాయపడుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది, ముఖ్యంగా పనిచేసే ఉద్యోగస్తులు వారి బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకుంటారు. ఇది చాలా తేలికగా ఉంటుంది మరియు ఇది చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. మరియు ఇది పొట్ట నిండినట్లు అనుభూతిని కలిగిస్తుంది. ఓట్స్ లో అనేక న్యూట్రీషినల్ బెనిఫిట్స్ కలిగి ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ఓట్స్ ను వివిధ రకాలుగా ఎలా తయారుచేయాలో చాలా మందికి తెలియదు. సాధారణంగా ఓట్స్ లో పాలు మిక్స్ చేసి తీసుకుంటుంటారు. మరింత హెల్తీగా మరియు బరువు తగ్గించే వంటగా తయారుచేసుకోవాలంటే, ఓట్స్ లో మరికొన్ని పదార్థాలు, లేదా పండ్లు మిక్స్ చేసి తయారుచేసుకోవాలి. మరి ఈ వెయిట్ లాస్ ఓట్ మీల్ -ఎగ్ వైట్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

ఓట్ మీల్: 1cup
ఎగ్ వైట్: 4
పెప్పర్: 1/2tsp
పాలు: 1/2cup
ఆలివ్ ఆయిల్: 1tsp
ఓరకిగానో: 1/2tsp
చీజ్: 1/2cube(గార్నిష్ కొరకు)
కొత్తిమర: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా పాలను తక్కువ మంట మీద వేడి చేయాలి.
2. తర్వాత అందులో ఓట్ మీల్ వేసి , బాగా మిక్స్ చేయాలి.
3. తర్వాత అందులో ఎగ్ వైట్ ను మిక్స్ చేయాలి.
4. అలాగే అందులో పెప్పర్ అప్పుడే వేయవచ్చు లేదా తర్వాత కూడా పెప్పర్ ను చిలకరించుకోవచ్చు.
5. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి.
6. ఇప్పుడు ఓట్స్ ఎగ్ వైట్ మిక్స్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని పాన్ మీద పోయాలి.
7. ఈ ఆమ్లెట్ ను రెండు వైపులా కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. ఇప్పుడు దానికి పెప్పర్ పౌడర్, ఓరిగానో చిలకరించాలి. మీరు ఇంకా దానీ మీద చీజ్ తురుమును కూడా చిలకరించాలి.
9. చివరగా కొత్తిమీర తరుగు గార్నిష్ చేయాలి. అంతే ఎగ్ వైట్ ఓట్ మీల్ ఆమ్లెట్ రెడీ. ఇది ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు హెల్తీ .



Click it and Unblock the Notifications