Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
గోధుమ రవ్వ పులిహోర

గోధుమ రవ్వ: 1cup
వేరుశెనగలు: 2tbsp
నిమ్మకాయ: 1
పచ్చిమిర్చి: 4-6
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత
పోపుకోసం:
పచ్చిశెనగపప్పు: 1tsp
ఆవాలు: 1/4tsp
జీలకర్ర: 1/4tsp
ఉద్దిపప్పు: 1/4tsp
ఎండుమిర్చి: 3-4
ఇంగువ: చిటికెడు
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చిమిర్చిని మంచినీళ్ళలో వేసి కడిగి, పక్కకు తీసి తడి ఆరిన తర్వాత రెండు దబ్బలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత నిమ్మకాయను సగానికి కట్ చేసి జ్యూసి తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఒక కప్పు నీళ్ళు పోసి, నీరు బాగా మరిగే సమయంలో గోధుమ రవ్వ, కొద్దిగా ఉప్పు వేసి, మూత పెట్టి ఐదునిమిషాల పాటు పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి.
4. తర్వాత పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, నూనె కాగిన తర్వాత అందులో వేరుశెనగపప్పు(పల్లీలు) దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా ఆయిల్ వేసి అందులో తాలింపుకు సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని ఒక దానికి తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకోవాలి.
6. తాలింపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి మరో రెండు నిమిషాలు వేయించి, తర్వాత వేయించి పెట్టుకొన్న వేరుశనగపప్పు, పసుపు, వేసి ఒక నిమిషం తర్వాత మిక్సింగ్ బౌల్ లోనికి వంచుకోవాలి.
7. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో పోపుతో పాటు ముందుగా ఉడికించి పెట్టుకొన్న గోధుమ రవ్వను కూడా వేసి దాని మీద నిమ్మరసంను కూడా వేసి అన్నీ కలిసిపోయేలా బాగా కలపుకోవాలి. రుచిని బట్టి ఉప్పును మధ్యలో కలుపుకోవచ్చు. అంతే గోధుమ రవ్వ పులిహోర రెడీ. దీన్ని ఏదేని ఉరగాయతో లేదో పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications