Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
గ్రీన్ చిల్లీ-క్యారెట్ ఫ్రై
హెల్తీ వెజిటేబుల్ క్యారెట్ లో అనేక హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. క్యారెట్ తో వివిధ రకాల వంటలు వండుతారు. క్యారట్స్‌లో పోషకాలు పుష్కలం. కంటికి, ఒంటికి మేలు చేసే గుణాలు మెండు. క్యారెట్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ మరియు కాలరీలు తక్కువ. క్యారెట్లు కంటికీ, ఒంటికి మాత్రమే కాదు డయాబెటిస్ తో పోరాడుతుంది. ఓరల్ హెల్త్ ను నిర్వహిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. ఇన్ని ఆరోగ్య సుగుణాలున్న క్యారెట్లతో ఇంట్లోనే వివిధ రకాల వెరైటీ వంటకాలను తయారు చేసుకోవచ్చు. క్యారెట్ జ్యూస్, క్యారెట్ మంచూరియా, క్యారెట్ రైస్, క్యారెట్ ఖీర్, ఒకటి కాదు..రెండు కాదు ఇలా చాలానే తయారు చేసుకోవచ్చు!
క్యారెట్ చిల్లీ ఫ్రై చాలా రుచికరంగా ఉంటుంది. కాస్త తియ్యతియ్యగా ఉండే క్యారెట్ కు స్పైసీగా గ్రీన్ చిల్లీ జోడించి క్యారెట్ ఫ్రై చేస్తే చాలా రుచిగా స్వీట్ అండ్ స్పైసీగా ఉంటుంది. ఇది చపాతీ, రైస్ కు ఒక సైడ్ డిష్ . ఇది మధ్యహాన్న భోజనానికి చాలా అద్భుతంగా రుచికరంగా ఉంటుంది. అంతే కాదు ఈ క్యారెట్ రైస్ కడుపు నిండుగా ఉంచుతుంది. మరి ఆరోగ్యపరంగా ఇన్న ప్రయోజనాలను చేకూర్చే క్యారెట్ ను రోజూ వంటలోకి ఓ క్యారట్ తురిమి వేయండి. ఇంకో క్యారట్‌ను తరిగి వండండి. నూనెలో వేసి డీప్ ఫ్రై చే యండి. వేయించకుండానే పెరుగులో కలిపేయండి. దేనికది భిన్నమైన టేస్ట్ అంటూ లొట్టలు వేయంచండి.

కావల్సిన పదార్థాలు:
క్యారెట్లు: 4
పచ్చిమిరపకాయలు: 4 సన్నగా తరిగిపెట్టుకోవాలి (మీకు కారం ఎంత అవసరమో అంత జోడించుకోవచ్చు)
ఉల్లిపాయ: 1/2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు:2
జీలకర్ర: 1/4 tbsp
ఆవాలు: 1/4 tbsp
మినపప్పు: 1/2 tbsp
కరివేపాకు: కొద్దిగా అవసరం అయినంత
పసుపు: 1/4tsp
నూనె: 2 tbsp
ఉప్పు: 1 tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా క్యారెట్ కు పై పొట్టును తొలగించాలి. తర్వాత శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత వీటిని గిన్నెలో వేసి ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసి మీడియం మంట మీద హాఫ్ బాయిల్ చేసుకోవాలి(మరీ మెత్తగా కాకుండా ఓ మోస్తరుగా ఉడికించుకోవాలి)
3. అంతలోపు పచ్చిమర్చి, వెల్లుల్లి రెబ్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4. క్యారెట్ ఉడికిన తర్వాత క్రిందికి దింపి ఎక్స్ ట్రా నీరు వంపేసి, చల్లారనివ్వాలి.
5. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, అందులో జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కులు, చిటికెడు ఉప్పు, వేసి వేగిస్తే ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వేగుతాయి. తర్వాత అందులోనే పసుపు కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసి 10 నిముషాల పాటు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూ అందులో పచ్చిమిర్చి, వెల్లల్లి ముక్కలు లేదా పేస్ట్ ను వేసి మరికొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అంతే గ్రీన్ చిల్లీ క్యారెట్ ఫ్రై రెడీ. ఇది చపాతీ మరియు రైస్ కు సైడ్ డిష్ గా అద్భుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications