Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
హింగ్ దహీవాలే చట్ పేట్ ఆలూ రిసిపి
పిల్లలకు ఎల్లప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందివ్వాలని తల్లులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా, బ్రేక్ ఫాస్ట్, లంచ్ విషయంలో చాలా మూడీగా ఉంటారు. పిల్లలు ఆరోగ్యకరంగా తినడానికి హెల్తీ ఆహారాన్ని తయారుచేయడం కొంచెం కష్టమైన పని అనిపిస్తుంది. వారు హెల్తీ మీల్స్ కంటే, టేస్టీ ఫుడ్స్ నే ఎక్కువగా ఇష్టపడుతారు కాబట్టి. పిల్లలు ఎప్పుడూ మృదువైన ఆహారాలను ఇష్టపడరు. వారు ఎప్పుడూ స్వీట్స్ మరియు ట్యాంగీ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతారు.
మరి అటువంటి పిల్లల కోసం ఒక హల్తీ వంటకాన్నీ ఈ రోజు మీముందుంచుతున్నాం. ఈ వంటను చట్ పట్ ఆలూ అని పిలుస్తారు. చట్ పట్ అంటే ఇది కొంచెం పుల్లగా ఉంటుంది . ఈ రిసిపిని వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగించి తయారుచేస్తారు. ట్యాంగీ టేస్ట్ కోసం, ఇందులో డ్రై మ్యాంగో పౌడర్ ను మిక్స్ చేస్తారు. ఈ చట్ పట్ రిసిపి పిల్లలకు టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా హెల్తీ కూడా..మరి మీ పిల్లలకోసం దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 6 (ఉడికించి పొట్టు తీసినవి)
పెరుగు: 1 cup (beaten)
ఇంగువ: ½ tsp
మెంతులు: ½ tsp
ధనియాలు: 1tsp(రఫ్ గా పొడి చేసుకోవాలి)
ధనియాలపొడి: 1tsp
ఛాట్ మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యా, మెంతులు, ధనియాలు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
2. తర్వాత అందులో ముందుగా ఉడికించుకొన్న బంగాళదుంపలు వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. ఛాట్ మసాలను, పెరుగులో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే ధనియాల పొడి, ఉప్పు మరియు ఒక కప్పు నీళ్లు కూడా పోసి బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమాన్నిబంగాళదుంప వేగుతున్న పాన్ లో వేసి బాగా మిక్స్ చేయాలి.
5. బాగా ఉడికించి ఇంగువ చిలకరించి, మంటను పూర్తిగా తగ్గించి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఇంగ్ దహీ వాలే చట్ పాటే ఆలూ రెడీ. ఈ వెజ్ రిసిపిని రైస్ తో కలిపి తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications