Latest Updates
-
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే! -
సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా..వైరల్ ఫిష్ ఫ్రై ఈజీగా ఇలా చేసేయండి -
బుద్ధ పూర్ణిమ ఈసారి ఎప్పుడొస్తోంది? బ్యాంక్ పనులు ఉన్నవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! -
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు! -
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు!
హాట్ అండ్ స్పైసీ టమోటా షేర్వా
కిలో నలభై అమ్మాలన్నా....నాలుగు రూపాయలన్నా ఒక్క టమోటాకే చెల్లుతుంది. కూరగాయ సంచిలో ఎర్రటి టమోటాలు లేకపోతే మార్కెట్‌కి వెళ్లి ప్రయోజనం ఉండదు. పప్పు టమోట, వంకాయ టమోట, టమోటతో చికెన్, టమోట పచ్చడి....ఇలా బోలెడు వెరైటీలతో వంటింట్లో తన ప్రత్యేకతను చాటుకుంటుంది.
ప్రస్తుతం మార్కెట్ నిండా బోలెడు టమోటాలు కనబడుతున్నాయి. పెద్ద ఖరీదు కూడా లేదు. చవగ్గా దొరుకుతున్నాయి కదా అని కేవలం పచ్చళ్లు పట్టుకుని సరిపెట్టకండి. టమోటాలతో చేసే వివిధ రకాల కొత్త వెరైటీలను కూడా ప్రయత్నించిం కొత్త రుచులను మీ టేస్ట్ బడ్స్ కు రుచి చూపించండి. అటువంటి టమోటో స్పెషల్ వెరైటీ వంటల్లో టమోటో షేర్వా ఒకటి. దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు అతి తక్కువ మసాలాలతో తక్కువ సమయంలో టేస్టీగా తయారుచేయవచ్చు. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
టమోటాలు: 1/2kg
ఉల్లిపాయలు: 2(పెద్దవి)
అల్లంవెల్లుల్లి: 1tbsp
గరంమసాలా: 1tsp
జీలకర్ర: 1/2tsp
ఆవాలు: 1tsp
కరివేపాకు: రెండు రెబ్బలు
కారం: 2tsp
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారుచేయు పద్ధతి:
1. ముందుగా టమోటాల్ని ముక్కలు కోసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బిపెట్టుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో అల్లంవెల్లుల్లి ముద్ద కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద మందపాటి పాన్ పెట్టి సరిపడా నూనె వేసి బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లి వేసి బాగా వేగించుకోవాలి.
4. అలాగే ఉప్పు, కారం, పసుపు కూడా వేసి కలపాలి. తర్వాత టమోటా గుజ్జుని కూడా వేసి వేగించుకోవాలి.
5. తరువాత ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. దగ్గరగా అయ్యాక దించేయాలి. ఇలా చేసిన షేర్వ బిర్యానిలోకి చాలా రుచిగా ఉంటుంది. అంతే టమోటో షేర్వా రెడీ.



Click it and Unblock the Notifications