Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
వేసవిలో కూల్ కూల్ ఫ్రూట్ సలాడ్ తో మజా చేయండి...
ఎండాకాలంలో చల్లచల్లని సలాడ్ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యం మాత్రమే కాదు, రుచికి కూడా బాగుంటాయి. పండ్లు తినని పిల్లలకు సలాడ్ ల రూపంలో చేసి పెట్టండి. తియ్య తియ్యగా తినడానికి ఇష్టపడతారు. సలాడ్ లలో పోషక విలువలు కూడా అధికం. వేసవి తాపానికి భోజనం చేయాలన్నా, చపాతీలు తిన్నాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ముందుగా తయారు చేసి ఫ్రిజ్‌లో పెట్టుకున్న ఈ సలాడ్ లను బయటికి వెళ్లి వచ్చిన తరువాత చల్లగా తింటుంటే ఆ మజానే వేరు.. మరి మీరు ఈ సలాడ్ ల రుచి ఏమిటో ఒక సారి చూడండి...

కావలసిన వస్తువులు:
దానిమ్మ గింజలు : 1cup
ద్రాక్షపళ్లు : 1cup
పైనాపిల్ ముక్కలు : 1cup
అరటిపండు ముక్కలు : 1cup
చెర్రీ పండ్లు : 1/2cup
మామిడిపండు ముక్కలు : 1cup
ఆపిల్ పండు ముక్కలు : 1cup
కమలాతొనలు : 1cup
మిరియాలపొడి : 1/2tsp
ఉప్పు : సరిపడినంత
తేనె : 1/4cup
నిమ్మ రసం : 2tsp
తయారు చేసే విధానం:
1. ముందుగా పైన చెప్పిన పండ్లన్నింటినీ శుభ్రంచేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి.
2. తర్వాత ఈ పండ్ల ముక్కల మీద మిరియాల పొడి, ఉప్పు వేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి నాలుగు గంటల పాటు ప్రిజ్‌లో ఉంచితే చాలు ఫ్రూట్ సలాడ్ రెడీ.
3. ఇలా అయితే అన్ని రకాల పండ్లు తినవచ్చు. దీని వలన శరీరానికి కావలసిన విటమిన్లు అందుతాయి.



Click it and Unblock the Notifications