Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
కీరదోస సాండ్ విచ్

కీర దోసకాయలు : 2
బ్రెడ్ స్లైసులు: 6
చీజ్ : 4 tbsp
వెన్న : 4 tbsp
ఉప్పు :తగినంత
మిరియాలపొడి: చిటికెడు
సోయాకూర లేదా కొత్తిమిర: 2 tsp
గ్రీన్ చట్నీ: 1/4 cup
(కొత్తిమిర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి రుబ్బుకుని గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి)
1. కీర దోసకాయలు చెక్కు తీసి సన్నని స్లైసులుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత చిన్న గిన్నెలో వెన్న, చీజ్, ఉప్పు, మిరియాలపొడి, సన్నగా కట్ చేసిన సోయాకూర లేదా కొత్తిమిర వేసి కలిపి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు బ్రెడ్ స్లైసుల అంచులు కట్ చేసి చీజ్ మిశ్రమాన్ని పలుచగా పూయాలి. దానిపైన గ్రీన్ చట్నీ కూడా పలుచగా రాసి కీర స్లైసులు అమర్చాలి.
4. దాన్ని చీజ్, గ్రీన్ చట్నీ రాసిన మరో స్లైసుతో మూసి కాస్త అదిమి ఫ్రిజ్ లో పెట్టాలి. పదినిమిషాల తర్వాత తీసి త్రికోణాకారంలో రెండు ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి. అంతే కీర దోస సాండ్ విచ్ రెడీ.



Click it and Unblock the Notifications