బెండకాయ మసాలా కర్రీ

Ladies Finger Masala Curry
కావలసిన పదార్థాలు:
బెండాకాయలు: 1/2kg
శెనగపిండి: 4tsp
చిక్కని చింతపండు రసం: 2tsp
నూనె: తగినంత
పంచదార: 1/2tsp
కొత్తీమీర తురుము: 1/2cup
ఉల్లిపాయలు: 2పెద్దవి
టమాటాలు: 2పెద్దవి
ఎండు మిర్చి: 5-8
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
జీలకర్ర: 1tsp
వేయించిన జీడిపప్పు పలుకులు:5-8

తయారు చేయు విధానము:
1. టమాట, ఉల్లిపాల్ని అలాగే బెండకాయల్ని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు టమాట, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర తీసుకుని మిక్సీలో వేసి మిశ్రమంలా చేసుకోవాలి.
3. పాన్ లో నూనె వేసి వేడి చేసి బెండకాయ ముక్కలు వేయించాలి. ముక్క మెత్తగా వేగుతున్నప్పుడు..ఉప్పు, పసుపు, పంచదార, చింతపండు రసం, శెనగపిండి, కాస్త నీరు చేర్చి ఉడకనివ్వాలి.
4. పదినిమిషాలయ్యాక ముందుగా చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ, టమాట మిశ్రమాన్నీ ఇందులో కలపాలి. కూర కాస్త దగ్గరగా అయిఉడుకుతున్నప్పుడు నూనె పైకి తేలినట్టు అనిపిస్తుంది. అప్పుడు వేయించిన జీడిపప్పు పలుకులు, కొత్తిమీర తురుముతో గార్నిష్ చేస్తే సరి బెండకాయ మసాలా కర్రీ రెడీ.

Story first published: Thursday, January 12, 2012, 13:52 [IST]
Desktop Bottom Promotion