Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
దొండకాయ-మామిడి తురుము ఆవకాయ...

కావలసిన పదార్థాలు:
దొండకాయలు: 6-8
పచ్చి మామిడికాయ: 1
కారం: 2tbsp
ఆవాలు: 1tsp
మెంతి పొడి: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1cup
తయారు చేయు విధానం:
1. ముందుగా దొండకాయలను నీళ్ళలో వేసి కడిగేసుకొని తర్వాత ప్లేట్ లోనికి తీసుకొని పొడి బట్టతో తేమను పూర్తిగా తుడిచేసుకోవాలి. తేమను తుడిచిన తర్వాత కూడా పది పదిహేను నిమిషాలు అలాగే పక్కన పెట్టుకోవాలి.
2. పదిహేను నిమిషాల తర్వాత దొండకాయలను రెండు భాగాలుగా మద్యలోనికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పచ్చి మామిడి కాయను కూడా శుభ్రం చేసే తడి ఆరిన తర్వాత తురుముకోవాలి. లేదా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4. తర్వాత ఆవాలను దోరగా వేయించుకొని, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పౌడర్ ను రెడీ చేసుకోవాలి.
5. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కారం, ఆవాల పొడి, మెంతి పొడి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అందులోనే కొద్దిగా దొండకాయ ముక్కలు, మామిడి తురుము(మామిడి ముక్కలు), నూనె కూడా వేసి బాగా అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి.
6. అంతే దొండకాయ-మ్యాంగో పికెల్ రెడీ. దీన్ని రెండు మూడు గంటలన్నాస్పైసీస్ లో ఊరనివ్వాలి. తర్వాత వాడుకోవాలి. ఇది వేడి వేడి అన్నం, లేదా రోటీ, దోశ లోనికి చాలా రుచికరంగా ఉంటుంది.
సూచన: పచ్చి కాయలతో పికెల్ నచ్చని వాళ్ళు, నూనె తప్పా మిగిలిన పదార్థాలన్నీ పై చెప్పినట్టు మిక్స్ చేసుకొని చివరగా కడాయిలో నూనె పోసి అందులో మరి కొద్దిగా ఆవపొడి, మెంతిపొడి, కారం, ఉప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేగించి అందులో దొండమామిడి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూత వున్న డబ్బా లేదా బాటిల్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టుకొంటే వారం పది రోజుల పాటు ఉంటుంది.



Click it and Unblock the Notifications