మసాలా ఎగ్ దోసె....

Masa Egg Dosa
కావాల్సిన పదార్ధాలు:
దోసెపిండి : 1/2kg
కోడి గుడ్లు : 3
ఉల్లిపాయ : 2
పచ్చిమిర్చి: 2-4
వెల్లుల్లి రెబ్బలు: 4-6
అల్లం : చిన్న ముక్క
కారం : 1/2tsp
ధనియాల పొడి : 1tsp
గరం మసాలా : 1/2tsp
టొవెూటో పూరి : 3tsp
వెజిటబుల్ ఆయిల్ : 1cup
పచ్చి బఠాణీలు (ఉడికించాలి): 1tbsp
కొత్తిమీర తరుగు : 1cup
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా దోసెపిండి తయారు చేయడానికి ఒక కప్పు బియ్యం, ఒకకప్పు ఉప్పుడు బియ్యం, ఒక కప్పు మినపప్పు, టీస్పూన్ మొంతి, శెనగపప్పు లతో దోసెలపిండి తయారు చేసుకోవాలి.ఈ పిండి బాగా ఎనిమిది గంటల నుండి పదిగంటలపాటు పులసనివ్వాలి.
2. మొదటగా గుడ్డు ఉడికించి ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఈ పేస్టును బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. మిగతా మసాలా పదార్ధాలు వేసి ఒక నిముషం పాటు వేయించాలి.
3. తర్వాత అందులోనే టోమేటో పూరి కూడా కలిపి, నూనె అంచుల వెంబడి వదిలే వరకు ఉడికించాలి. కొద్దిగా నీరు పోసి, పొడి పొడిగా అయ్యేవరకు ఉడికించాలి.
4. ఇప్పుడు ఉడికించి వుంచుకున్న బఠాణీలు, కట్‌ చేసిన గుడ్డుముక్కలు వేసి ఇంకొన్ని నీళ్ళు పోసి సన్నని సెగపై పదినిముషాలు ఉడికించాలి. ఆపై కొత్తిమీర చల్లి పక్కన ఐదు నిమిషాలు అలాగే ఉంచి తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ పై దోసె(నాన్‌స్టిక్) పాన్‌ వేడిచేసి గరిటె పిండిపోసి పరచాలి. అన్ని వైపులా కొద్దిగా నూనె పోసి దోసెను ఎర్రగా రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. పైన రెడీ చేసి పెట్టుకొన్న మసాల మిశ్రమాన్ని దోసె మధ్యలో పెట్టి దోసెను చుట్టాలి. అంతే మసాలా ఎగ్ దోసె రెడీ...దీనికి మంచి కాంబినేషన్ కొబ్బరి చట్నీ, సాంబారు లేదా కొత్తిమీర చట్నీతో తింటే రుచిగా
ఉంటుంది.

Story first published: Tuesday, March 27, 2012, 10:16 [IST]
Desktop Bottom Promotion