Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మసాల క్యాప్సికం కర్రీ

కావలసిన పదార్థాలు:
క్యాప్సికం: 3-4
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4-6
టమోటో: 2
కారం: 1 tbsp
ధనియాలు: 1tbsp
నువ్వులు: 1/4cup
వేరుశెనగుళ్ళు: 1/2 cup
కొబ్బరి తురుము: 1/2cup
ఆవాలు : 1tsp
మెంతులు: చిటికెడు
చింతపండు: నిమ్మకాయంత
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
కొత్తిమీర: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. మొదటగా పాన్ లో ధనియాలు, వేరుశెనగలు, నువ్వులు, కొబ్బరి వేసి వేయించి తీసి పక్కన తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత కొద్దిగా చల్లారాక వీటన్నింటినీ మిక్సర్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ పై పాన్ పెట్టి అందులో తగినంత నూనె వేసి అందులో ఆవాలు, మెంతులు వేయించాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
4. తర్వాత అందులో క్యాప్సికం ముక్కలు వేసుకొని వేయించాలి. క్యాప్సికం ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్నవేరుశెనగ మసాల పేస్ట్ ను వేసి మరో ఐదు నిమిషాల పాటు వేయించుకొవాలి.
5. అవి వేగుతూ ఉన్నట్లే అందులో టమోటోముక్కలు, కారం, ఉప్పు వేసి వేయించాలి. కొద్దిసేపటి తర్వాత నానబెట్టి పెట్టుకొన్నచింతపండు గుజ్జు కొంచెం అందులో వేసి, అది కొంచెం గట్టి పడేవరకు వుంచాలి. అలా కొంచెం గట్టిపడిన తర్వాత స్టౌ మీద నుంచి దించేముందు కొత్తిమిర వేయ్యాలి.



Click it and Unblock the Notifications