Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
మిక్డ్స్ వెజిటబుల్ కుర్మా

క్యారట్: 2
బంగాళదుంపలు: 3
బీన్స్ తరుగు: 1/2cup
పచ్చిబఠాణీ: 1/2cup
క్యాలీఫ్లవర్ తరుగు: 1/4cup
పచ్చికొబ్బరి తుమురు: 1/2cup
కారం: 2tsp
జీడిపప్పు: 8-10
ఏలకులు: 2
లవంగాలు: 4
ఉల్లిపాయలు: 3
జీరా పొడి: 1tsp
గసగసాలు: 1tsp
పసుపు : చిటికెడు
నూనె: కావలసినంత
ధనియాలపొడి: 2tsp
ఉప్పు : రుచికి తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
కొత్తిమీర తరుగు: 1/2cup
కరివేపాకు: రెండు రెమ్మలు
దాల్చినచెక్క: చిన్న ముక్క
పచ్చిమిర్చి తరుగు: 2tbsp
టొమాటో తరుగు : పావుకప్పు
తయారు చేయు విధానం:
1. పచ్చికొబ్బరి తురుము, గసగసాలు, జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. అన్ని రకాల కూరగాయముక్కలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో నూనె వేడి చేసి, అందులో ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, మసాలా దినుసులు కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరాపొడి, మిరప్పొడి, ధనియాలపొడి వేసి కొద్దిగా వేగాక, ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న పచ్చికొబ్బరి మిశ్రమాన్ని వేసి నూనె తేలేవరకు వేయించాలి.
4. ఇప్పుడు కొద్దిగా నీరు, టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తరవాత ఉడికించుకున్న కూరగాయముక్కలు, ఉప్పు, గరంమసాలా వేసి గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించి దించేసుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications