Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
ముల్లంగి పరోటా...నార్త్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్
మీకు పరోటా అంటే ఇష్టమా?అయితే మీకు మరింత ఆకలి కలిగేలా నోరూరిస్తుంటుంది పరోటా రిసిపి. పరోటాను వివిధ రకాలుగా తయారు చేస్తారు. ముల్లంగి పరోటా స్పెషల్ డిష్. ఈ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ చాలా పాపులర్. ముల్లంగి ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యకరం.
ముల్లంగి తరుమును చపాతీ పిండిలో స్టఫ్ చేసి పరోటాను తయారు చేస్తారు. ఈ పరోటాలు ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ చాలా ఇష్టంగా తింటారు. పంజాబీలో చాలా పాపులర్ అయిన్ ఈ బ్రేక్ ఫాస్ట్ కడుపు నింపు ఫీలింగ్ కలిగిస్తుంది. ఎక్కువ సేపు ఆకలి కానివ్వదు. మరి ముల్లంగి పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం...

ముల్లంగి: 1(తురుము)
ఉల్లిపాయలు: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర తరుగు: 2tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
చాట్ మసాలా: 1tsp
జీలకర్ర పొడి: 1/2tsp
గోధుమ పిండి: 2cups
మైదా: 1/2 cup
అజ్వైన్: 1/2tsp
నెయ్యి: 2tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అవ్వగానే, అందులో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించాలి.
2. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 3,4 నిముషాల వేగించాలి. తర్వాత అందులో ముల్లంగి తురుమును వేసి తక్కువ మంట మీద ఐదు నిముషాల పాటు బాగా ఫ్రై చేయాలి.
3. తర్వాత అందులోనే ఉప్పు, కొత్తిమీర తరుగు మరియు చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసి మరో ఐదు నిముషాల ఫ్రై చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
4. ఇప్పుడు ఒక బౌల్లో మైద, గోధుమపిండి, అజ్వైన్ మరియు ఉప్పు, ఇక చెంచా నెయ్యి వేసి, తగినన్ని గోరువెచ్చని నీళ్ళు పోసి చపాతీ పిండిలా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత చపాతీ పిండిని చిన్నచిన్న ఉండలు చేసుకొని మద్యలో వత్తుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకొన్న ముల్లంగి మిశ్రమాన్ని ఒక చెంచా పెట్టి కవర్ చేయాలి.
6. ఇలా అన్ని చాపాతీ బాల్స్ నింపి పెట్టుకొన్న తర్వాత ఒక్కొక్కటే చపాతీ కర్రతో చపాతీలా వత్తుకోవాలి. దీన్ని పాన్ మీద నూనె వేసి ఈ పరోటాలను రెండు వైపులా బాగా కాలేలా మీడియం మంట మీద కాల్చుకోవాలి . అంతే ముల్లంగి పరోటో రెడీ...



Click it and Unblock the Notifications