Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పాలక్ దోస

పాలకూర - 1 కట్ట
బియ్యం - 1 కప్పు
కందిపప్పు - 1 కప్పు
పచ్చి శెనగపప్పు - 1 కప్పు
పెసరపప్పు - 1 కప్పు
పచ్చిమిరప - 4
ఉల్లిపాయాలు - 2
జిలకర్ర - 11/2 tsp
క్యారెట్ - 2
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - కావలసినంత
తయారు చేయు పద్దతి:
మొదట బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, పచ్చి శెనగపప్పు అన్ని కలిపి ఒకపాత్రలో వేసి అందులో నీరు పోసి శుభ్రంగా కడిగి ఒక గంట సమయం నానబెట్టాలి. తర్వాత నీటి నుండి వేరు చేసి గ్రైడ్ చేసి దోస పిండిలా కలిపి పెట్టుకోవాలి తర్వాత పాలకూర ను విడిపించి ఒక గిన్నేలో నీరు పోసి మరిగిన తర్వతా శుభ్రం చేసి పెట్టుకొన్న పాలాకును అందులో వేసి 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి గ్రైడ్ చేసి ఆ పేస్ట్ ను, కొద్దిగా ఉప్పు, జిలకర్ర జతచేసి బియ్యంపు పిండి పేస్ట్ లో కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరప, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ ను తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టి పాన్ బాగా వేడెక్కిన తర్వాత నూనె రాయాలి. గరిటతో దోసపిండి తీసుకొని పాన్ మీద దోసలా వేసి వెంటనే దాని మీద కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము వేసి మరి కొద్ది నూనె చల్లి మీడియం మంట మీద కాలనివ్వాలి అంతే వేడి వేడి పాలక్ దోస రెడీ. పాలక్ దోసను ప్లేట్ లో తీసుకొని టమాటో చట్నీతో వడ్డిస్తే చాలా రుచిగా వుంటుంది.



Click it and Unblock the Notifications











