Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
పావ్ భాజీ స్పెషల్

బంగాళాదుంపలు : 4
టమోటాలు : 4
ఉల్లిపాయలు : 2
పచ్చ బఠానీ : 1/4cup
కాలీఫ్లవర్ : కొద్దిగా
పచ్చిమిర్చి : 3
కొత్తిమీర : ఒక కట్ట
అల్లం : కొద్దిగా
వెల్లుల్లి : 6 రెబ్బలు
క్యాప్సికం : 1
నిమ్మకాయ: 1
ఉప్పు : రుచికి సరిపడా
పెరుగు : 3tsp
బావ్ బాజీ మసాలా : 2tsp
పావ్ (బన్)
నూనె
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళాదుంపలను, ఉడికించి, తొక్కతీసి, చిన్నగా చితిమి పక్కన పెట్టుకోవాలి. టమాటాలను సన్నగా తరిగి వుంచాలి. 2. తర్వాత పచ్చిబఠానీని కొంచెం నీళ్లలో వేసి మెత్తగా ఉడికించి పక్కన వుంచాలి. కాలీఫ్లవర్ ను పువ్వుల కింద విడదీసి, కాడలు కట్ చేసి వుంచాలి. కాప్సికమ్ ను కూడా ముక్కలు చేసి వుంచాలి.
3. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కలిపి గ్రైండ్ చేయాలి.
4. పాన్ లో కాస్త నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి, దోరగా వేయించాలి. దానికి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను జతచేసి మరి కొద్దిసేపు కలియపెట్టాలి.
5. ఆపై టమాటా ముక్కలు జోడించి, రెండు మూడు నిమషాలు ఉడకనివ్వాలి. అవసరమైతే నీళ్లు చిలకరించవచ్చు. ఇప్పుడు కాప్సికమ్, కాలీఫ్లవర్, పచ్చిబఠానీ, బంగాళాదుంపల ముక్కలు జోడించి, అరకప్పు నీళ్లు వేసి సన్నటి సెగపై పదినిమిషాల పాటు ఉడకనివ్వాలి.
6. ఆపై చిన్న గరిటెను వెనుకకు తిప్పి, దాని సాయంతో కూరగాయముక్కలన్నీ చితికేలా చేయాలి. తగినంత ఉప్పు, పావ్ బాజీ మసాలా జోడించి, మూతపెట్టి, సన్నటి సెగపై మరికొద్దిసేపు ఉడికించాలి. కొద్దిగా బటర్ వేసి దింపి పక్కన వుంచాలి.
7. ఫైనల్ గా పెనంపై కాస్త బటర్, చిటికెడు ఉప్పుకలిపిన కారం వేసి, పావ్ బన్ ను మధ్యకు కోసి, కాల్చాలి. ముందుగా తయారైన కూరపై కాస్త కొత్తిమీర జల్లి, నిమ్మకాయ రసం పిండి, పావ్ బన్ తో జోడించి వడ్డించాలి. అంతే పావ్ బాజీ రెడీ.



Click it and Unblock the Notifications