Latest Updates
-
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!
ఇండియన్ పాపులర్ సైడ్ డిష్ పుదీనా- కొత్తిమీర పచ్చడి

పచ్చళ్ళు రోటి, రైస్, చాట్స్, స్నాక్స్ వంటివాటికి చక్కటి కాంబినేషన్. అంతే కాదు... బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... దేనిలోనైనా సరే పచ్చడే విన్నర్. తెలుగువారు కోరుకునే పచ్చళ్లల్లో ముఖ్యమైనది కొత్తిమీర, పుదీనా పచ్చడి. ఈ రెండింటితో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు:
పుదీనా: రెండు కట్టలు
కొత్తిమీర: ఒక కట్ట
వెల్లుల్లి రెబ్బలు: 5-6
అల్లం: చిన్నముక్క
పచ్చిమిర్చి: 8-10
పంచదార: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం లేదా చింతపండు గుజ్జు: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా కొత్తిమీరను కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. పుదీనా ఆకులను వేరు చేసి అవి పక్కన పెట్టుకోవాలి. రెండింటినీ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
2. తర్వాత వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీ గ్రైండర్ లో కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, పంచదార, ఉప్పు కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులోనిమ్మరసం లేదా చింతపండు గుజ్జు కలపాలి.
4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి వేయించాలి. ఈ పోపును పుదీనా, కొత్తిమీర మిశ్రమంలో కలపాలి. (ఈ పచ్చడిని పలచగా కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు) ఈ పచ్చడి ఇడ్లీ, దోసె, వడలలోకి చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications