Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
రోటీ సూపర్ కాంబినేషన్ అరటికాయ-టమోటో కర్రీ
కావల్సిన పదార్థాలు:
పచ్చి అరటికాయ: 2
టమోటో: 2
చింతపండు: కొంచెం
కారం: 1tsp
గరం మసాలా: 1tsp
కొత్తిమీర తరుగు: కొద్దిగా
ఉప్పు: రుచికి తగినంత
పోపు కోసం
ఆవాలు: 1/4tsp
జీలక్ర: 1/4tsp
ఉద్దిపప్పు: 1tsp
ఎండుమిర్చి: 3-4
ఇంగువ: చిటికెడు
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: 2tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చిఅరటికాయలను నీటితో కడిగి, పొడి క్లాత్ తో తుడిచి తడి ఆరిన తర్వాత రెండు వైపుల కొనలను కట్ చేసుకొని, తర్వత కాయ మీద మందంగా ఉన్న పొట్టును తొలగించి తర్వాత కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత టమోటోలను నీటిలో శుభ్రపరిచి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
3. అలాగే కొత్తమీరను కూడా నీటిలో శుభ్రంచేసుకొని తర్వాత తరిగి పెట్టుకోవాలి. చింత పండును(చిన్న నిమ్మకాయలో సగబాగం అంత)నీటిలో వేసి రెండు మూడు నిమిషాలపాటు నానబెట్టి గుజ్జును తీసుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో పోపుకోసం సిద్దం చేసుకొన్న దినుసులను ఒక దానిక తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి.
5. తర్వాత కట్ చేసి పెట్టుకొన్న పచ్చి అరటికాయ ముక్కలను వేసి బాగా వేయించాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
6. ఇప్పుడు అందులో టమోటో ముక్కలను, చింత పండు గుజ్జును, ఉప్పు కూడా వేసి మీడియం మంట మీద, టమోటో మెత్తబడేంత వరకూ వేయించుకోవాలి.
7. టమోటో కొద్దిగా మెత్తబడ్డాక అందులో గరం మసాలా, కారం, వేసి ఒక నిమిషం పాటు వేయించి, పైన కొత్తిమీర తరుగును చల్లి స్టౌ మీద నుండి క్రిందికి దింపుకోవాలి. అంతే అరటికాయ టమోటో కర్రీ రెడీ దీన్ని వేడి వేడి అన్నం లేదా చపాతీలతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications