స్పైసీ అండ్ ట్యాంగీ ఆఛారీ పన్నీర్ రిసిపి

ఆఛారీ పన్నీర్ రిసిపి పాపులర్ ఇండియన్ రిసిపి ఈ వంటలను పండుగల సందర్భాల్లో స్పెషల్ గా వండుకోవచ్చు. ఆఛారీ పన్నీర్ రిసిపి కొద్దిగా పికెల్ పన్నీర్ గా ఉంటుంది . ఎందుకంటే ఈ ఆఛారి పన్నీర్ రిసిపికి పికెల్ మసాలాను ఉపయోగిస్తారు కాబట్టి, దీన్ని స్పైసీ ఆఛారీ పన్నీర్ మసాలా రిసిపి అని పిలుస్తారు.

ఆఛారీ పన్నీర్ రిసిపి అద్భుతమైన ఫ్లేవర్ కలిగి చూడగానే నోరూరిస్తుంటుంది. ఇది కొద్దిగా స్పైసీ మరియు ట్యాంగీ టేస్ట్ కలిగి ఉంటుంది . టేస్ట్ బడ్స్ ను నోరూరించే ఈ స్పెషల్ డిష్ కు సాధారణంగా మ్యాంగో పికెల్ యొక్క మసాలాను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ఆచారీ పనీర్ రిసిపికి మీరు ఏపికెల్ యొక్క మసాలా అయినా ఉపయోగించుకోవచ్చు. మరి ఈ స్పైసీ ఆచారీ పనీర్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Achari Paneer Recipe

కావల్సిన పదార్థాలు:
పనీర్: 500gms
క్యాప్సికమ్:1 (సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 1(సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2
వెల్లుల్లి రెబ్బలు: 5-6
అల్లం: ఒక చిన్న ముక్క
టమోటాలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఆమ్చూర్(మామిడి పొడి): 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ధనియాలా పొడి: 1tsp
పసుపు పొడి: 1tsp
గరం మసాలా పొడి: ½tsp
కారం పొడి: ½tsp
కాలోంజి(ఉల్లిపాయ గింజలు): 1tsp
ఆవాలు: ½tsp
పికెల్ మసాలా: 1tbsp(మీకు నచ్చిన ఏ ఊరగాయ యొక్క మసాలా అయినా తీసుకోవచ్చు)
బిర్యానీ ఆకు: 1
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: 1tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సీ గ్రైండర్ లో ఉల్లిపాయలు, టమోటోలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి మరియు అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ విత్తనాలు, ఆవాలు, బిర్యానీ ఆకు, వేసి రెండు మూడు సెకండ్లు ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో ముక్కలుగా కట్ చేసుకొన్న క్యాప్సికమ్ కూడా వేసి మరో నిముషం ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి మరో 5 నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాలపొడి, మామిడిపొడి, గరం మసాలా, పసుపు, వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులో పికెల్ మసాలా కూడా జోడించి(ఊరగాయ ముక్కలు వేయకూడదు)కేవలం మసాలా మాత్రం తీసుకొని అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.
7. మిక్స్ అయిన తర్వాత అందులో పనీర్ ముక్కలు మరియు ఉప్పు కూడా వేసి మరో 3-4నిమషాలు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
8. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు పోసి, మూత పెట్టి మీడియం మంట మీద 5నిమషాలు ఉడికించుకోవాలి
9. పన్నీర్ ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత మూత తీసి, మంటను తగ్గించి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే టేస్టీ అండ్ ట్యాంగీ స్పైసీ ఆచారీ పన్నీర్ రిసిపి రెడీ . ఈ డిష్ రోటీలకు చక్కటి కాంబినేషన్.

Story first published: Saturday, September 13, 2014, 18:02 [IST]
Desktop Bottom Promotion