Latest Updates
-
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026
స్పైసీ థాయ్ బాసిల్ ఫ్రైడ్ రైస్
మీ రెగ్యులర్ మెనుకు బ్రేక్ ఇవ్వానుకుంటున్నారా?ఈ అద్భుతమైన థాయ్ రైస్ రిసిపిని సర్వ్ చేయండి. ఇది మీ టేస్ట్ బడ్స్ కు ఒక కొత్త రుచిని అందిస్తాయి . థాయ్ కుషన్స్ లో రైస్ ను వివిధ పద్దతుల్లో తయారుచేస్తారు. అయితే ఫ్రైడ్ రైస్ రిసిపి. దీన్ని గార్లిక్ మరియు బాసిల్ చాలా టేస్ట్ గా ఉంటుంది.
స్పైసీ థాయ్ బాసిల్ ఫ్రైడ్ రైస్ సాధారణంగా ఒక బాస్మతి రైస్ తో తయారుచేస్తారు. బెల్ పెప్పర్ మరియు రెడ్ చీల్లీ మరియు ఆరోమాటిక్ బాసిల్ లీవ్స్(తులసి ఆకులతో)తయారుచేస్తారు. ఈ థాయ్ స్పెషల్ రిసిపిని మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఏలా తయారుచేసుకోవాలో తెలుసుకోవాల్సిందే...

బాస్మతి రైస్: 2 cups
ఉల్లిపాయలు: 2 (సన్నముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
బెల్ పెప్పర్: - 2 (సన్నముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
క్యారెట్ : 2(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం: 1tsp (తురిమినది)
వెల్లుల్లి పేస్ట్: 1tsp
కారం పేస్ట్: 2tsp
సోయా సాస్: 1tsp
పంచదార: 1tsp
బాసిల్(తులసి) తరుగు: 1cup(సన్నగా తరిగినవి)
నూనె: 1tbsp
నీరు: 4 cups
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత నాలుగు కప్పుల నీళ్ళు పోసి 15నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
2. ఒక సారి ఉడికిన తర్వాత గంజి పూర్తిగా వంపేసి అన్నం పొడిపొడిగా తయారుచేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పు ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి , ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా వేయించుకోవాలి.
4. తర్వాత అందులో క్యారెట్, బెల్ పెప్పర్స్, అల్లం మరియు వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం మంట మీద 5నిముషాలు వేయించుకోవాలి.
5. ఇప్పుడు టమోటో, రెడ్ చిల్లీ పేస్ట్, పంచదార, ఉప్పు మరియు సోయా సాస్ వేసి 5నిముషాలు వేయించుకోవాలి.
6. ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
7. చివరగా బాసిల్(తులసి ఆకులు)వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత పాన్ మూత పెట్టి తర్వాత 5నిముషాలు ఉడికించుకొని. స్టౌ ఆఫ్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే స్పైసీ థాయ్ బాసిల్ రైస్ ను వేడి వేడిగా సర్వ్ చేయండి. దీనితో మీకు నచ్చిన సైడ్ డిష్ లేదా సాస్ తో సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications