Latest Updates
-
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
ముడి పెసళ్ళు మొలకల సలాడ్: హెల్తీ బ్రేక్ ఫాస్ట్
దిన చర్యను ప్రారభించడానికి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే, మీ శరీరంలో జీవక్రియలన్నీ చురుకుగా పనిచేయాలి. అందుకు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం అవుతుంది. ప్రతి రోజూ ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల మీరు ఫిట్ గా ఉంటారు మరియు మీరు చేసే పనిలో ఏకాగ్రత పెంచుకోవచ్చు. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం మీరు సరైన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో మీ దిన చర్యను ప్రారంభించడం మనందరికి చాలా అసవరం.
మొలకలు మన ఆరోగ్యానికి అనేక ఆరోగ్యప్రయోజనాలను అంధిస్తాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరియు బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక గ్రేట్ హోం రెమెడీ. కాబట్టి, ఈ రోజు మీకోసం ఒక ఫర్ ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి. ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపి వల్ల మీరు బరువు తగ్గడంతో పాటు మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు.

కావల్సిన పదార్థా:
ముడి పెసళ్ళు: 2cups
టమోటో: 1cup(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కీరదోస ముక్కలు: 1cup(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కొత్తిమీర: 1tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2-3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
సలాడ్ డ్రెస్సింగ్ కోసం:
బ్లాక్ పెప్పర్ : 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1tsp(రోస్ట్ చేసుకోవాలి)
నిమ్మరసం: 1tbsp
పెరుగు: 2tbsp
అల్లం జ్యూస్: 1tbsp
ఆలివ్ ఆయిల్: 1tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్లో సలాడ్ డ్రెస్సింగ్ కోసం సిద్దంగా ఉంచుకొన్న పదార్థాలన్నింటిని వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత సాస్ పాన్ లో అరగంట పాటు నానబెట్టుకొన్న ముడిపెసరలు వేసి, 1/4కప్పు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
3. పెసరలు ముప్పావ్ బాగం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
4. తర్వాత పాన్ మీద మూత పెట్టి ఆవిరిలోనే 5నిముషాలు అలాగే ఉంచాలి.
5. మరో పదినిముషాలు అలాగే ఉంచడం వల్ల రూమ్ టెంపరేచర్ లో చల్లార్చుకోవాలి.
6. ఉడికించి ముడిపెసరలు చల్లారిన తర్వాత, డ్రెస్సింగ్ కోసం సిద్దంగా ఉంచుకొన్నమిశ్రమ పదార్థాలన్నింటిని వేసి బాగా మిక్స్ చేయాలి.
7. అంతే సర్వ్ చేసేటప్పుడు, టమోటో స్లైస్, కీరదోసముక్కలతో సర్వ్ చేయాలి.
8. అంతకు ముందే పచ్చిమిర్చి మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే సర్వ్ చేయడానికి హెల్తీ స్ప్రాట్ మూంగ్ దాల్ సలాడ్ రెడీ. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను ఎంజాయ్ చేస్తూ తినండి.



Click it and Unblock the Notifications