Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
జీర్ణశక్తిని పెంచే ఉడిపి స్టైల్ రసం రిసిపి
రసంలేదా చారు అనేది ఒక దక్షిణ భారత సూపు (ద్రవపదార్థ వంటకం). సాంప్రదాయ తయారీ విధానంతో తయారయ్యే ఈ వంటకంలో ప్రధానంగా చింతపండు రసం ఉపయోగించడంతో పాటు అదనంగా టమోటో, నిమ్మకాయ, మిరప మరియు ఇతర రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు. ఏదేని కూరగాయలు జోడించడంతో పాటు ఉడకబెట్టిన పప్పులును కూడా కొంచెం ఈ రసానికి కలుపుతారు. ప్రస్తుత రోజుల్లో రసం తయారీకి అవసరమైన మసాలా దినుసులన్నింటినీ ఒక్కటిగా జోడించి ముందుస్తుగానే పొడిచేసి అప్పటికప్పుడు ఉపయోగించడానికి వీలుగా రసం పొడి పేరుతో అందుబాటులో ఉంచుతున్నారు.
వీటిని అన్నంతో కలిపి లేదా సూపు రూపంలో తీసుకునేందుకు వీలుగా ఉంటాయి. సంప్రదాయ భోజనంలో ఇది సాంబారు అన్నం తర్వాతి స్థానాన్ని వహించడంతో పాటు దీనితర్వాత పెరుగు అన్నం తీసుకోవడం జరుగుతుంది. రసం అనేది తనకంటూ ప్రత్యేకమైన మసాల దినుసులను కలిగి ఉండడంతో పాటు పూర్తిగా పల్చటి ద్రవ రూపంలో ఉండడం వల్ల సాంబారుతో పోలిస్తే రసం అనేది ఒక విశిష్టమైన రుచిని కలిగి ఉంటుంది.

కావల్సిన పదార్థాలు:
కందిపప్పు: 1/2cup
టమోటోలు :2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
చింతపండు: నిమ్మపండుఅంత అరకప్పు గోరువచ్చుని నీళ్ళలో నానబెట్టాలి.
నీళ్ళు: 4cups
రసం పౌడర్: 3tbsp
పచ్చిమిర్చి: 2(మద్యకు కట్ చేయాలి)
పసుపు: 1/2tsp
బెల్లం: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పోపుకోసం:
ఆవాలు: 1/3tsp
ఉద్దిపప్పు: 1/2tsp
కారం: 1(రెండుగా కట్ చేసి పెట్టుకోవాలి)
కొత్తిమీర తరుగు: 2tbsp
నూనె లేదా నెయ్యి:1tbsp
రసం పౌడర్:
కారం: 8
ధనియాలు: 2tbsp
జీలకర్ర:1/2tsp
మెంతులు: 1/4tsp
కొత్తిమీర: కొద్దిగా
కొబ్బరి తురుము: 2
ఇంగులు: చిటకెడు
తయారుచేయు విధానము:
1.ముందుగా రసం పౌడర్ కు సిద్దం చేసుకొన్న పదార్థాలన్ని కూడా దోరగా వేగించి , చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
2.ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు రసం, పచ్చిమిర్చి, టమోటో, బెల్లం మరియు కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయాలి. స్టౌ మీద పెట్టి 10 నిముషాలు ఉడికించుకోవాలి.
3. ఇప్పుడుఅందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న కందిపప్పు ,రసం సౌడర్ మరియు కొబ్బరి తురుము వేసి మీడియం మంట మీద 10 నిముషాలు ఉడికించుకోవాలి. మంట తగ్గించి కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసుకోవాలి.
4. రసం ఉడికేలోగా, పొపు సిద్దం చేసుకోవాలి.
5. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో ఆవాలు వేసి చిటపటాలిడిన తర్వాత అందులో ఉద్దిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు మరియు ఇంగువ వేసి వేగిన తర్వాత ఉడుకుతున్న రసం వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
6. అందులో కొత్తీమర తరుగు వేసి మికస్ చేయాలి. అంతే ఉడిపి స్టైల్ రసం రిసిపి రెడీ . దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications