Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
వెజిటబుల్ పలావ్

బియ్యం : అర కిలో
కారెట్ : 4
బీన్సు: 100grm
బంగాళా దుంపలు లేదా ఆలూ: 4
ఉల్లిపాయలు : 6
పచ్చి బఠాణీ : 1 cup నానబెట్టినవి
లవంగాలు: 5
యాలకులు : 5
దాల్చిన చెక్క : 5
అల్లం వెల్లుల్లి ముద్ద : 2
నూనె , నేయ్యి - తగినంత
పచ్చిమిర్చి - 5
ధనియాలు - 2 tsp
కారం - 1
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడ
నీరు - ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసు నీరు
కొత్తిమీర - ఒక కట్ట
పుదినా - అర కట్ట
బిర్యాని ఆకు : 2
తయారు చేయువిధానం:
1. ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాన నివ్వాలి. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి.
2. ఒక మందంగా ఉన్న గిన్నె గాని కుక్కర్ గాని తీసుకొని స్టౌ మీద పెట్టాలి. అందులో సుమారు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు, బిర్యాని ఆకు మరియు చెక్క వేసి వేయించాలి.
3. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వెసి. అది పచ్చి వాసన పోయే దాక వేయించి పచ్చి మిర్చి మద్యకు కట్ చేసి వేసుకోవాలి. వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు అన్ని వేసుకొని అవి కొంచెం బాగా వేగ నివ్వాలి.
4. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం అందులో వేసి. అన్ని బాగా కలిపి కొత్తిమీర, పుదినా, ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాలు వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు ఒక వంతు బియ్యానికి రెండు వంతులు నీరు పోసి అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూడు విజిల్ వచ్చాకా దింపుకోవాలి. అంతే వెజిటేబుల్ పలావ్ రెడీ. దీనికి పెరుగు పచ్చిడి మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications