వెజిటేబుల్ స్టఫ్ మసాలా బిర్యాని

Vegetable Stuffed Masala Biryani
కావలసిన పదార్థాలు:
యాలకుల పొడి: 1tsp
కొత్తిమీర: 1కట్ట
పసుపు: 1/2tsp
పాలు: 1/4cup
నెయ్యి: 2tbsp
రీఫైండ్ ఆయిల్: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
పెరుగు: 1cup
పుదీనా: 1/2cup
వెజిటబుల్ ముక్కలు: 4cups
మసాలా దినుసులు: 10grms
బాస్మతి రైస్: 1/2kg
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tbsp
ఉల్లిపాయలు: 1cup

తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి మరిగాక.. మసాలా దినుసులను వేసి వేయించాలి.
2. అందులోనే పుదీనా, కొత్తిమీర, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, యాలక్కాయల పొడి, కారం, ఉప్పు, బీన్స్, క్యారెట్ టమోటో, ఉల్లిపాయ ముక్కలు, పెరుగులను ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి.
3. తర్వాత ఇంకో గిన్నెలో బియ్యం ఎసరు పెట్టి, అందులో పాలు కూడా పోసి ఎసరు వచ్చాక నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి,సగం ఉడికాక గంజి వార్చేసి పక్కన ఉంచుకోవాలి.
4. ఇప్పుడు వేరొక వెడల్పాటి పాత్రలో అడుగున ఉడికించిన రైస్ కొద్దిగా వేసి, పైన వేయించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను వేసి, మళ్లీ కొద్దిగా అన్నం.. ఇలా 4వరుసలుగా పేర్చుకోవాలి.
5. తర్వాత మూత పెట్టి 10ని. ఉడికించాలి. మూత తీసి సరిపడా నెయ్యేసి, అన్నాన్ని దించేయాలి. అంతే వెజిటేబుల్ మసాలా స్టఫ్డ్ బిర్యానీ రెడీ.

Story first published: Thursday, August 2, 2012, 15:35 [IST]
Desktop Bottom Promotion