Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
వీకెండ్‌లో... మటన్ మస్తీ..మేక తలకూర లేదా తలకాయ కూర
Goat Head Curry వారాంతం వచ్చిందంటే, చాలా మంది తమ ఇళ్లలో మాంసాహారం వండుకుని తింటారు, అది మటన్, చికెన్, ఫిష్ వాసన వచ్చేలా చేస్తుంది. నాన్ వెజ్ ప్రియులకు తలకాయ కూర గుర్తొస్తే నోట్లో నీళ్లూరిపోవడం ఖాయం. దీన్ని అన్నంలో తిన్నా, చపాతీతో తిన్నా, రాగిసంగటితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. తలకాయ కూరను టేస్టీగా వండే వారి సంఖ్య తక్కువే. నిజానికి తలకాయ కూరను సరైన పద్ధతిలో వండితే ఆ కూరకు ఇంకేది సాటి రాదు. తలకాయ కూర సులువుగా టేస్టీగా ఎలా వండాలో ఇక్కడ మేము చెబుతున్నాం.
తలకాయ కూర మటన్ విభాగం కిందకే వస్తుంది. మేక, గొర్రెల తలలతోనే ఈ కూరను వండుతారు. అందుకే మటన్ తినడం వల్ల కలిగే లాభాలన్నీ ఈ కూర తిడనం వల్ల కలుగుతాయి. మటన్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మహిళలు అధికంగా తింటే మంచిది. వీరికి రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. ఈ మటన్లో బి విటమిన్లు అధికంగా లభిస్తాయి.గర్భిణులు మటన్ తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు చాలా లాభాలు కలుగుతాయి. మటన్లో ఉండే పొటాషియం రక్తపోటు, గుండెజబ్బులు, కిడ్నీ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఇందులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకల గట్టిదనానికి సహకరిస్తాయి. తలకాయ కూర సులువుగా ఎలా వండాలో చూడండి.

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్‌వైపు మనసు లాగేస్తుంది. అయితే వీకెండ్‌లో జిహ్వచాపల్యం తీరాలంటే మటన్‌తో ఇలాంటి వంటలను ట్రై చేయండి.
కావలసినవి:
మేక తలకాయ మాంసం - అరకేజీ
కొత్తిమీర - ఒకకట్ట
గరంమసాల - ఒక టీస్పూన్
కొబ్బరి తురుము - ఒక టేబుల్‌స్పూన్
ధనియాల పొడి - ఒక టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
కారం - ఒక టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - రుచికి తగినంత
నూనె - సరిపడా
నల్ల జీలకర్ర - పావు టీస్పూన్
తయారీ విధానం:
1. స్టవ్‌పై కుక్కర్ పెట్టి నూనె వేసి కాస్త
వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేయించాలి.
2. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం వేయాలి.
3. కాసేపు వేగిన తరువాత తలకాయ మాంసం వేయాలి. తగినంత ఉప్పు వేసి,
కొన్ని నీళ్లు పోసి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.
4. ఆవిరిపోయిన తరువాత కూరను పాన్‌లోకి మార్చుకుని మళ్లీ
స్టవ్‌పై పెట్టాలి.
5. ఇప్పుడు మిరియాల పొడి, ధనియాల పొడి, గరంమసాల, కొబ్బరి
తురుము(కొబ్బరి పేస్ట్) వేసి కలుపుకోవాలి(కొబ్బరి తురుము మీకు నచ్చితే
వేసుకోవచ్చు. వేయకపోయినా రుచి బాగానే ఉంటుంది). 6. కాసేపు ఉడికిన
తరువాత కొత్తిమీర వేసి దింపుకోవాలి. అంతే తలకాయ కూర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications