కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.!

వంటగదిలో ఒక్కోసారి తెలిసీతెలియక చేసే పొరపాట్ల వల్ల గంటలో అయిపోయే పని కాస్త రెట్టింపు సమయం తీసుకుంటుంది. ముఖ్యంగా కుక్కర్‌లో పప్పు పొంగి స్టవ్‌ మొత్తం వ్యాపించడం, అన్నం మెత్తగా అవడం, అడుగు అంటుకోవడం, అతుక్కోవడం.. ఇంకా ఎన్నో పొరపాట్లు జరుగుతుంటాయి. దీనివల్ల శ్రమ ఎక్కువవుతుంది. కానీ ఈ చిన్న చిన్న టిప్స్‌ను సమయానుసారంగా పాటించడం వల్ల కిచెన్‌లో మీ పని సులువుగా అయిపోతుంది.

With these kitchen tips rice won t stick and dal won t boil over

ఆకుకూరలను ఉడకబెట్టే విధానం..

పాలకూర, పచ్చి బఠానీలు, బ్రోకలీ వంటి ఆకుపచ్చని కూరగాయలను ఉడకబెట్టేటప్పుడు వాటిలోని సహజ రంగు కోల్పోతుంది. అందుకే ఉడికించేటప్పుడు ఇందులో పావు టీస్పూన్‌ చక్కెర కలపడం ద్వారా రంగు పోదు. ఉడికిన వెంటనే వీటిని చల్లటి నీళ్లలో వేసినట్లయితే ఆకుపచ్చ రంగు పోకుండా తాజాగా ఉంటుంది.

రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా..

అన్నం పొడిగా, మంచిగా ఉడకాలంటే..

కొన్ని సార్లు అన్నం వండిన తర్వాత జిగటగా అవుతుంది. అందుకే అన్నం వండేటప్పుడు సరైన పరిమాణంలో నీళ్లు పోయాలి. ఎక్కువాతక్కువ కాకుండా బియ్యం కొలత లెక్కన చూసుకుని నీళ్లు పోసినట్లయితే అన్నం అంటుకోదు. వండేటప్పుడు కొద్దిగా నిమ్మరసం, టీస్పూన్‌ నూనె కలపడం ద్వారా పొడిపొడిగా ఉండటమే కాకుండా అన్నం మెత్తగా ఉడుకుతుంది.

With these kitchen tips rice won t stick and dal won t boil over

పప్పు పొంగిపోకుండా..

పప్పు వండేటప్పుడు ఒక్కోసారి నీళ్లు ఎక్కువైతే కుక్కర్‌లో నుంచి నీరు బయటకు వచ్చేస్తుంది. దీంతో స్టవ్‌ మొత్తం జిడ్డుగా మొండిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కుక్కర్‌లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయండి. ఇది నీటి బుడగలను విచ్ఛిన్నం చేసి నీరు పైకి రాకుండా లోపలే ఉండేలా చేస్తుంది. లేదంటే చిన్న స్టీల్‌ బౌల్‌ లేదా చెంచాను ఉంచడం ద్వారా బయటకు పొంగిపోదు.

రాఖీ 2026 స్పెషల్: స్వీట్‌ షాప్‌ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్‌ బర్ఫీ.!

పచ్చడి చేసేటప్పుడు..

టమాటా, ఉల్లిపాయ పచ్చళ్లు లేదా టిఫిన్‌ పచ్చళ్లు చేసేటప్పుడు నూనెలో వేయించాక అది చల్లారడానికి సమయం పడుతుంది. వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేస్తే హీట్‌ ఎక్కువై పచ్చడి బయటకు వచ్చేస్తుంది. మీకు చల్లారబెట్టడానికి సమయం లేకపోతే వాటిలో కొన్ని ఐస్‌ క్యూబ్స్ వేసి రుబ్బండి. ఉడికించిన కూరగాయలను ప్యూరీ చేసేటప్పుడు ఐస్‌ క్యూబ్స్‌ వేయడం ద్వారా మీ పని సులువవుతుంది.

వెల్లుల్లి తొక్క ఈజీగా..

మసాలాలు ప్రిపేర్‌ చేసేటప్పుడు అతి పెద్ద పని వెల్లుల్లి తొక్క తీయడం. దీనికి చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా వాటి తొక్క గోళ్లకి అంటుకుపోయి మంట పుట్టేలా చేస్తుంది. దీనికి సింపుల్‌ చిట్కా ఉంటుంది. మీ కిచెన్‌లో మైక్రోఒవెన్‌ ఉంటే అందులో 2 నిమిషాల పాటు వెల్లుల్లిని ఉంచండి. ఇలా చేస్తే పొట్టు సులభంగా ఊడిపోతుంది. మైక్రోఒవెన్‌ లేకకపోతే వేడినీళ్లలో వేసి కాసేపు ఉంచండి. వేడికి వెల్లుల్లి మెత్తబడి పొట్టు త్వరగా ఊడి వస్తుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, August 25, 2026, 16:39 [IST]
Desktop Bottom Promotion